News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Spy Movie: అందరూ అనుకున్నట్టే అయ్యిందిగా - నిఖిల్ ‘స్పై’ మూవీ వచ్చేది అప్పుడేనట!

‘స్పై’ మూవీను గతంలోనే జూన్ 29 న విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే తర్వాత రిలీజ్ చేసిన టీజర్ లో మూవీ రిలీజ్ డేట్ ను వేయలేదు. దీంతో అందరూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని అనుకున్నారు. కానీ..

FOLLOW US: 
Share:

Spy Movie: టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ రీసెంట్ గా నటించిన మూవీ ‘స్పై’. ఈమూవీకు గర్రీ బి హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా ఈ మూవీను తెరకెక్కించినట్టు చెప్పడంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్ లు ఆకట్టుకునేలా ఉండటంతో ఉత్కంఠ మొదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సినిమాను జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నట్లు తెలిపారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సినిమా వాయిదా పడినట్లు వార్తలు..

‘స్పై’ మూవీను గతంలోనే జూన్ 29 న విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే తర్వాత రిలీజ్ చేసిన టీజర్ లో మూవీ రిలీజ్ డేట్ ను వేయలేదు. దీంతో అందరూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని అనుకున్నారు. అందరూ రకరకాల కారణాలు చెప్పారు. అయితే హీరో నిఖిల్ గానీ మూవీ టీమ్ గాని దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు. దీంతో నిజంగానే మూవీ వాయిదా పడింది అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో మళ్లీ మూవీ రిలీజ్ డేట్ ను జూన్ 29 అని వేశారు. హీరో సిద్ధార్థ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్ట్ చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీగా ప్రపంచ వ్యాప్తంగా మూవీను రిలీజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో ‘స్పై’ మూవీ డేట్ కంఫర్మ్ అయినట్టు ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. 

నిఖిల్ మాట పట్టించుకోలేదా?

నిఖిల్ ‘స్పై’ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. అందుకే హీరో నిఖిల్ మూవీ ప్రమోషన్స్ ను దేశవ్యాప్తంగా చేయాలని అనుకున్నారట. అందుకు తగ్గట్టుగా ప్లానింగ్ లు కూడా చేశారట. కానీ అందుకు సమయం లేకపోవడంతో నిర్మాతలు దానికి అంగీకరించలేదని టాక్. దీంతో సినిమా విడుదల లేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ముందుగా అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. 

సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో..

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటిష్ వారిపై వార్ ప్రకటించారు. గాంధీ అహింసా మర్గాన్ని ఎంచుకుంటే నేతాజాీ మాత్రం యుద్దం ప్రకటించి బ్రిటిసర్లకు చమటలు పట్టించారు. అయితే సుభాష్ చంద్రబోస్ ఆకస్మికంగా మరణించడం అందర్నీ కలచి వేసింది. ఆయన మరణానికి గల కారణాలు ఏంటనేది ఎవ్వరికీ తెలియరాలేదు. ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే ఉంది. అలాంటి మిస్టరీను బ్యాక్డ్రాప్ గా తీసుకొని వస్తోన్న ‘స్పై’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మూవీలో ఆయన మరణం గురించి ఏం చెప్తారు. మూవీకు దానికి సంబంధం ఏంటనేది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈ మూవీలో తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

Published at : 18 Jun 2023 07:24 PM (IST) Tags: Tollywood Nikhil Siddharth Iswarya Menon Actor Nikhil SPY Movie

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!

Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే