Naveen Chandra: తండ్రైన హీరో నవీన్ చంద్ర, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఓర్మా
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గుడ్ న్యూస్ చెప్పారు. తనకు పండంటి మగ బిడ్డ పుట్టినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశారు. అభిమానులకు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా రాణిస్తున్న నవీన్ చంద్ర తండ్రి అయ్యారు. ఆయన సతీమణ ఓర్మా తాజాగా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. బాబును ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. “Me and orma Blessed with a baby boy” అంటూ ఈ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. చిన్నారి కాలుని ముద్దాడుతూ నవీన్ చంద్ర ఫోటోల్లో కనిపించారు. బాబు కాలిని తన ముఖానికి టచ్ చేయించుకుంటూ పుత్రోత్సాహంలో మునిగిపోయారు. ఆయన షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు నవీన్ చంద్రకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
View this post on Instagram
గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఓర్మాను పరిచయం చేసిన నవీన్
చాలా కాలంగా టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్న నవీన్, ఏనాడు తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు చెప్పలేదు. తన పెళ్లి గురించి, తన భార్య గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మా ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు పంచుకున్న తర్వాత ఇంచుమించు ఏడాదికి తండ్రి అయినట్లు వెల్లడించారు.
View this post on Instagram
సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ
ప్రస్తుతం టాలీవుడ్ లో నవీన్ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. తాజాగా నందమూరి బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో కీలక పాత్ర పోషించారు. అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. జూ. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవిదం సమేత వీరరాఘవ’లోనూ బాలరెడ్డిగా నటించారు. ఈ సినిమాలో బసిరెడ్డిగా నటించిన జగపతి బాబు కొడుకుగా నటించి మెప్పించారు. `అందాల రాక్షసి` సినిమాతో నవీన్ చంద్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న పాత్రలో కనిపించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత `దళం`, `భమ్ భోలేనాథ్`, `నా రాకుమారుడు`, `త్రిపుర`, `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, ``మీలో ఎవరు కోటీశ్వరుడు`, `నేను లోకల్`, `జూలియల్ లవర్ ఆఫ్ ఇడియట్`, `దేవదాస్`, `ఎవరు`, `భానుమతి అండ్ రామకృష్ణ`, `మిస్ ఇండియా`, `మోసగాళ్లు`, `అర్థ శతాబ్ధం`, `గని`, `విరాటపర్వం`, `రంగ రంగ వైభవంగా`, `అమ్ము` లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఓటీటీల్లోనూ సత్తాచాటుతున్నారు.
Read Also: వామ్మో! ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?