అన్వేషించండి

Devil Movie: ‘డెవిల్’ మూవీ గ్లింప్స్: సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్, గూడచారి అలాగే ఉండాలట!

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ ‘డెవిల్’ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Devil Movie: గతేడాది ‘బింబిసార’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఆయన కెరీర్ కు బిగ్ బూస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ మూవీ తర్వాత ఈ ఏడాది ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కళ్యాణ్ రామ్ మరో భారీ ప్రాజెక్టుతో రాబోతున్నారు. జులై 5 కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘డెవిల్’ మూవీ గ్లింప్స్  వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీకు నవీన్ అనే కొత్త దర్శకుడు పనిచేస్తున్నారు. ‘బింబిసార’ లో కళ్యాణ్ రామ్ తో జతకట్టిన సంయుక్తం మీనన్ ఈ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. 

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్..

‘బింబిసార’ సినిమా నుంచి స్క్రిప్ట్ సెలక్షన్స్ లో మార్పులు చేశారు కళ్యాణ్ రామ్. కథకు బలం ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టారు కళ్యాణ్ రామ్. అందులో భాగంగానే ‘డెవిల్’ మూవీను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇక ‘డెవిల్’ సినిమా బ్రిటీష్ కాలంలో సాగే కథలా కనిపిస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలంలో ఉండే ఒక సీక్రెట్ ఏజెంట్ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. తాజాగా విడుదల అయిన గ్లింప్స్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఈ గ్లింప్స్ లో కళ్యాణ్ రామ్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. గ్లింప్స్ లో సాలిడ్ విజువల్స్ కనిపిస్తుండగా కళ్యాణ్ రామ్ మరోసారి తన వెర్సటాలిటీని చూపించాడు. అలాగే తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పాలి. ‘‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు, మొదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం’’ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా పర్ఫెక్ట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్నాయనే చెప్పాలి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ మళ్లీ ‘బింబిసార’ లాంటి హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

త్వరలో ప్రేక్షకుల ముందుకు..

కళ్యాణ్ రామ్ నుంచి ‘బింబిసార’ లాంటి మరో క్రేజీ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు తన పుట్టినరోజు సందర్భంగా ‘డెవిల్’ గ్లింప్స్ వీడియో రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోతో మూవీపై అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ఇక సినిమాలో ఫైటింగ్స్, మాస్ ఎలివేషన్స్, లవ్, ఎమోషన్స్ సీన్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీను ప్రముఖ నిర్మాత అభిషేర్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా ప్రేక్ష‌కుల ముందుకు మూవీను తీసుకొచ్చేందుకు యూనిట్ పనిచేస్తుంది. మరి ఈ మూవీ కళ్యాణ్ రామ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. 

Also Read: అదీ పవర్ స్టార్ అంటే, జస్ట్ 380 నిమిషాల్లో 1.6 మిలియన్ ఫాలోవర్స్ - ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget