By: ABP Desam | Updated at : 03 Apr 2022 04:00 PM (IST)
రేవ్ పార్టీలో నీహారిక - నాగబాబు రియాక్షన్ ఇదే
గతరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లో రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉన్నారు. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.
కాసేపటిక్రితమే నీహారిక, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ కూడా తమ కార్లలో ఇంటికి వెళ్లిపోయారు. అయితే నీహారిక విషయంలో ఆమె తండ్రి, నటుడు నాగబాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని.. అనవసరమైన ఊహాగానాలు స్ప్రెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఆయనేం చెప్పారంటే..
''గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్ లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నీహారిక ఆ సమయానికి అక్కడ ఉండడమే.. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వలన పబ్ మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నీహారికకు సంబంధించినంత వరకు ఆమె క్లియర్ గానే ఉంది. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం వరకు నీహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎలాంటి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్ గా ఉంది. దయచేసి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్'' అంటూ వీడియోలో మాట్లాడారు.
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?
Actor & producer #NagaBabu releases a statement for Media. pic.twitter.com/cI2BLn1L7b
— Vamsi Kaka (@vamsikaka) April 3, 2022
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
YSRCP Bus Yatra : బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!