అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Naga Chaitanya OTT : చైతు రిస్క్ తీసుకుంటున్నాడా..?

నిర్మాత శరత్ మరార్, నాగచైతన్య మధ్య కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తన దగ్గరున్న టీమ్ ద్వారా నాగచైతన్యకు రెండు, మూడు స్టోరీలు వినిపించాడు శరత్ మరార్.

టాలీవుడ్ హీరోలెవరూ కూడా ఓటీటీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరోలు కూడా ఓటీటీ అంటే వద్దంటున్నారు. తమ ప్రయారిటీ సిల్వర్ స్క్రీన్ కే నొక్కి చెబుతున్నారు. అందుకే తెలుగులో కొత్త సినిమాలేవీ కూడా ఓటీటీల్లోకి రావడం లేదు. రీసెంట్ గా 'నారప్ప' లాంటి సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే దగ్గుబాబి అభిమానులు చాలా హర్ట్ అయిపోయారు. 'నారప్ప'ను థియేటర్లోనే రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ అలా జరగకపోవడంతో వెంకీ మీడియా ముఖంగా అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కలిగింది. 


ఇండస్ట్రీలో పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నాగచైతన్య కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఓ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత శరత్ మరార్, నాగచైతన్య మధ్య కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తన దగ్గరున్న టీమ్ ద్వారా నాగచైతన్యకు రెండు, మూడు స్టోరీలు వినిపించాడు శరత్ మరార్. వాటిల్లో చైతుకి ఓ కథ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. 


ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లాక్ అయిన తరువాత ఈ సినిమాను వెబ్ ఫిలింగా రూపొందించి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో చైతు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ విషయంలో అభిమానులు సంతోషంగా లేరని తెలుస్తోంది. నిజానికి ఇప్పుడున్న యంగ్ హీరోల్లో నటుడిగా చైతుకి మంచి పేరుంది. యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. 


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు హీరోగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో చైతు ఇండస్ట్రీ హిట్ అందుకుంటాడని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో చైతుకి ఓటీటీ వైపుకి వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు అక్కినేని అభిమానులు. 


నాగార్జునకు థియేట్రికల్ మార్కెట్ బాగా తగ్గింది. కాబట్టి అతడు ఓటీటీలోకి వెళ్లినా పర్లేదని సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ చైతు నేరుగా ఓటీటీలో సినిమా చేస్తానంటే మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకునేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న హీరోలెవరూ కూడా తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీకి ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు. అలాంటిది నాగచైతన్య లాంటి హీరో నేరుగా ఓటీటీలో సినిమా చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు. పైగా సిల్వర్ స్క్రీన్ మీద క్రేజ్ లేకపోతేనే ఓటీటీల్లోకి వస్తున్నారనే మాటలు జనాల్లో బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగచైతన్య ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతుండడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. 


మరి ఈ విషయంలో చైతు వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం చైతు 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలానే 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు చైతు. ఇటీవలే అమీర్ ఖాన్ తో కలిసి లడఖ్ షెడ్యూల్ లో పాల్గొన్నాడు చైతు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget