News
News
X

Kamal Haasan Hospitalised: కమల్ హాసన్‌కు అస్వస్థత, హైదరాబాద్ నుంచి వెళ్లగానే హాస్పిటల్‌కు తరలింపు!

దిగ్గజ నటుడు కమల్ హాసన్ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
 
ప్రముఖ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. నిన్న(బుధవారం) సాయంత్రం జ్వరంతో పాటు శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆయన పరిస్థితిని గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు చైన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆయనకు ప్రత్యేక వార్డులో వైద్యులు పరీక్షలు నిర్వహించి, చికిత్స చేశారు. ట్రీట్మెంట్ అనంతరం ఆయన పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు చెప్పారు.

చికిత్స తర్వాత డిశ్చార్జ్

కొద్ది సేపు హాస్పిటల్లోనే ఉన్న కమల్ హాసన్.. ఆరోగ్యం కుదుట పడ్డాక వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి ఆయన నేరుగా ఇంటికి చేరుకున్నారు. కొద్ది నెలల క్రితం కమల్‌కు కరోనా సోకింది. అప్పుడు కొద్ది రోజుల పాటు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. తాజాగా ఆయన మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన హెల్త్ బాగానే ఉన్నట్లు సన్నిహితులు వెల్లడించారు.

కె విశ్వనాథ్ ను కలిసిన కమల్ హాసన్

View this post on Instagram
 
A post shared by Kamal Haasan (@ikamalhaasan)

నవంబర్ 23న కమల్ హాసన్ హైదరాబాద్ కు వచ్చారు. దిగ్గజ దర్శకులు, తన గురువు అయిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. వారి సినిమాలకు సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నారు. కాసేపు గత స్మృతులను మళ్లీ గుర్తు చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా తన ఆశీర్వాదాలు తీసుకున్నారు. సాయంత్రం వేళ తిరిగి చెన్నైకి వెళ్లారు. ఆ సమయంలోనే తను అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జ్వరంతో పాటు శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. శ్వాస ఇబ్బందులు అంటే కరోనా కారణంగానే ఇలా అయి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కమల్ హాసన్ ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకున్నారు.

News Reels

‘ఇండియన్‌-2’ షూటింగ్‌లో కమల్ బిజీ

కమల్ హాసన్ అద్భుత నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమలో ఆయన అంటే అందరికీ ఎంతో గౌరవం. దర్శకుడిగా హాలీవుడ్ స్టైల్ మూవీస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోకు కమల్ హోస్టుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇండియన్‌-2 సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అటు ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో కలిసి మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గతేడాది ఆయన విక్రమ్ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. 

Read Also: పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు?

Published at : 24 Nov 2022 11:01 AM (IST) Tags: Actor Kamal Haasan Kamal Haasan Hospitalised Kamal Haasan unwell

సంబంధిత కథనాలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్