News
News
X

Fahadh Faasil Birthday Special : పనికిరాడన్నారు.. అవమానించారు.. కానీ ఈరోజు మలయాళ ఇండస్ట్రీని ఏలుతున్నాడు!

వరుస సినిమాలతో బిజీ స్టార్ గా మారిన ఫహద్ ఫాజిల్ నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

FOLLOW US: 

సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఫహద్ ఫాజిల్ ఒకరు. ఎలాంటి కథనైనా.. తన నటనతో రక్తి కట్టిస్తుంటారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరో అయినప్పటికీ ఓటీటీలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యారు. ఇక్కడ కూడా ఆయన ఫాలోయింగ్ పెరిగిపోతుండడంతో మన మేకర్స్ ఆయన్ను టాలీవుడ్ కు తీసుకొస్తున్నారు. రీసెంట్ గానే 'పుష్ప' సినిమాలో విలన్ గా ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేసుకున్నారు. వరుస సినిమాలతో బిజీ స్టార్ గా మారిన ఈ హీరో నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!

మొదటి సినిమా డిజాస్టర్.. 

ఫహద్ ఫాజిల్ తండ్రి పెద్ద డైరెక్టర్ కావడంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఫహద్ ఆసక్తి చూపించాడు. 19 ఏళ్లకే మేకప్ వేసుకొని హీరోగా నటించాడు. 2022లో అతడు నటించిన 'కైయేథుమ్‌ దురత్‌' అనే సినిమా విదురాలైంది. తండ్రి డైరెక్షన్ లో నటించిన ఈ లవ్ స్టోరీలో మమ్ముట్టి గెస్ట్ రోల్ కావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఫహద్ నటనను దారుణంగా విమర్శించారు. హీరోగా అతడు పనికిరాడన్నారు.  కానీ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మలయాళ ఇండస్ట్రీని ఏలుతున్నారు. 

యాక్టింగ్ వదిలేసి అమెరికాకు.. 

తన తొలి సినిమా ప్లాప్ అవ్వడానికి తండ్రి కారణం కాదని.. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి అంచనాలను అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నారు ఫహద్. ఆ తరువాత యాక్టింగ్ వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయారు. ఐదేళ్లపాటు అక్కడే ఎంఏ ఫిలాసఫీ చేశారు. ఇండస్ట్రీని వదిలి వెళ్లిన ఏడేళ్ల తరువాత ఫహద్ మళ్లీ తిరిగొచ్చారు. తండ్రి ప్రోత్సాహంతో ఈసారి దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో 'కేరళ కేఫ్' అనే సినిమాలో నటించారు. 2009లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఫహద్ కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో దూసుకుపోయారు. హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేకుండా దర్శకనిర్మాతలు అతడితో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఒకానొక దశకి వచ్చేసరికి మలయాళంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల లిస్ట్ లోకి చేరిపోయారు. 

హీరోయిన్‌తో ఎఫైర్.. 

గతంలో ఓ ఇంటర్వ్యూలో తమిళ నటి, సింగర్ ఆండ్రియాతో ఎఫైర్ ఉండేదని.. ఆ తరువాత బ్రేకప్ అయిందని.. దాని నుండి బయటకు రావడానికి సమయం పట్టేలా ఉందంటూ ఫహద్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ మాటలు ఇండస్ట్రీలో రచ్చగా మారాయి. ఆండ్రియా ఈ కామెంట్స్ ను ఖండించడంతో పాటు అతడిపై పరువు నష్టం దావా వేసింది. ఆ సమయంలో ఫహద్ ఆమెకి క్షమాపణలు చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇది జరిగిన ఏడాదికి మలయాళం హీరోయిన్ నజ్రియాను ప్రేమ వివాహం చేసుకున్నారు ఫహద్ ఫాజిల్. ఈ స్టార్ కపుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. నజ్రియా తన లైఫ్ లోకి వచ్చిన తరువాత సంతోషం రెట్టింపు అయిందని.. తన విజయంలో నజ్రియా పాత్ర ఉందంటూ చెబుతుంటారు ఫహద్ ఫాజిల్. 

Published at : 08 Aug 2021 10:25 AM (IST) Tags: Fahadh Faasil Fahadh Faasil birthday special Fahadh Faasil hbd happy birthday Fahadh Faasil

సంబంధిత కథనాలు

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

టాప్ స్టోరీస్

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!