Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్
నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

కూల్, రొమాంటిక్ సినిమాలతో అలరించిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు తన రూట్ మార్చేసి యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. “మాచర్ల నియోజకవర్గం” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ ఎటాక్ సినిమా మీద విపరేతమైన అంచనాలని పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సూపర్ అప్డేట్ ని వదిలారు. ఎ సినిమాలో అంజలి ప్రత్యేకమైన సాంగ్ లో నటిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ వదిలారు. హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది అంజలి. మరో సారి స్పెషల్ సాంగ్ లో నటిస్తూ కుర్రకారు మతి పోగొట్టేందుకు సిద్ధం అవుతుంది.
ఈ చిత్రం నుంచి అంజలి నటించిన స్పెషల్ సాంగ్ సోమవారం రిలీజ్ కానుంది. నితిన్ సరసన కృతి శెట్టి, క్యాథరిన్ థెరిస్సా నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. రాజకీయ కథా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంజలికి ఇది రెండో స్పెషల్ సాంగ్. సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















