Allari Naresh: అల్లరి నరేష్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్ షురూ - ఫస్ట్ సింగిల్ రెడీ
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆ ఒక్కటి అడక్కు`. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్ మొదలుకాబోతోంది.
![Allari Naresh: అల్లరి నరేష్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్ షురూ - ఫస్ట్ సింగిల్ రెడీ Aa Okkati Adakku musical album will soon resonate on saregama south Allari Naresh: అల్లరి నరేష్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్ షురూ - ఫస్ట్ సింగిల్ రెడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/8a73fe3f9f770c5b055a0579dfca582f1709372011384544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aa Okkati Adakku Musical Album Will Soon: మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లరి నరేష్, చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. తన మార్క్ కామెడీతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. నరేష్ అంటేనే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. కొంత కాలం తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు వరుస పరాజయాలను చవి చూశాయి. దీంతో కాస్త రూటు మార్చాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ‘నాంది’ సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం`, `ఉగ్రం` సినిమా కూడా అదే జానర్ లో చేశారు. రీసెంట్ గా నాగార్జునతో కలిసి `నా సామిరంగ` సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ చక్కటి విజయాన్ని అందుకుంది.
`ఆ ఒక్కటి అడక్కు` మ్యూజికల్ ప్రమోషనన్ షురూ
గత కొంత కాలంగా సీరియస్ కథాంశాలతో మూవీస్ చేస్తున్న అల్లరి నరేష్ మల్లీ కామెడీ బాట పట్టాడు. తన మార్క్ నటనతో మరోసారి అభిమానులను అలరించబోతున్నాడు. అల్లరి నరేష్ కెరీర్ లో 61వ సినిమాగా `ఆ ఒక్కటి అడక్కు` రూపొందుతోంది. మల్లి అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మ్యూజికల్ ఆల్బమ్ త్వరలో విడుదలకానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. మ్యూజికల్ సంస్థ సరిగమ వేదికగా ఈ మూవీ పాటలు విడుదల కానున్నట్లు తెలిపింది. ‘మోత మోగించడానికి మేము రెడీ’ అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
మోతమోగించడానికి….మేము రెడీ! 🤩🕺
— Chilaka Productions (@chilakaprod) March 1, 2024
The vibrant and catchy #AaOkkatiAdakku musical album will soon resonate on @saregamasouth ❤️🔥
Stay tuned for exciting updates! 💫#AOAonMarch22nd@allarinaresh @fariaabdullah2 @harshachemudu @ariyanaglory @Its_JamieLever @malli_co… pic.twitter.com/2X7x4wGMop
సినిమాపై అంచనాలను పెంచిన టీజర్
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ అపార్ట్ మెంట్‌లో ఉన్న వాళ్లంతా పెళ్లెప్పుడని అడుగుతుంటారు. దీంతో దోశలు వేసే పెనం పట్టుకుని పౌరుషంగా వెళ్తాడు. తీరా చూస్తే వెన్నెల కిషోర్ చేతిలో ఆ పెనం పెట్టి ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటాడు అల్లరి నరేష్. మొత్తంగా యాక్షన్ రూటు నుంచి మళ్లీ కామెడీ వైపు అడుగు పెట్టాడు అల్లరి నరేష్. ఈ గ్లింప్స్ చూస్తుంటే మరోసారి చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాతో వస్తున్నట్టు అర్థం అవుతుంది. మళ్లీ వింటేజ్ అల్లరిని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ సినిమాలతో ఫర్వాలేదు అనిపించిన అల్లరి నరేష్ మళ్లీ కామెడీతో ఎలా ప్రేక్షకులను నవ్విస్తాడో చూడాలి. ఇందులో వెన్నెల కిషోర్, వైవా హర్ష, జామీ లెవర్, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆ ఒక్కటీ అడక్కు' సినిమా మార్చ్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Read Also: ఈసారి మరింత కామెడీతో ‘సేవ్ ది టైగర్స్ 2’- ట్రైలర్ చూస్తే పొట్టచక్కలు కావాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)