‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సాంగ్, ‘కొత్త కొత్తగా’ భలే రొమాంటిక్‌గా ఉందే!
సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా నుంచి ‘కొత్త కొత్తగా..’ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు.
హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుంచి బుధవారం లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ బుధవారం రిలీజ్ చేశారు. ‘అల్లంత దూరంగా నువ్వు నీ కన్ను.. నన్నే చూస్తుంటే ఏం చేయాలో’ (కొత్త కొత్తగా..) అంటూ సాగే ఈ పాట వినసొంపుగానే కాకుండా, విజువల్ ట్రీట్ కూడా బాగుంది. సుధీర్ బాబు, కృతిశెట్టిల రొమాంటిక్ బాండ్‌ను ఈ పాటలో చూపించారు.
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ‘కొత్త కొత్తగా..’ సాంగ్‌ను అభయ్, చైత్ర చాలా చక్కగా ఆలపించారు. వినుల విందుగా సాగే ఈ పాట మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని కూడా అందించారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు కూడా మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఇంకా వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.
Also Read: సెట్‌లో ఫైర్, బట్టలతో పాటు నా చర్మం ఊడొచ్చేసింది.. చెవులు, పెదాలు కోల్పోయా: హీరో శ్రీరామ్
‘కొత్తగా కొత్తగా..’ సాంగ్‌ను ఇక్కడ చూడండి:
View this post on Instagram
Also Read: ఆ ముద్దు సీన్ కోసం 17 టేక్స్, 2 ఏళ్లు షూటింగ్, ‘All of Us Are Dead’లో ఆసక్తికర సన్నివేశం!