ఆ ముద్దు సీన్ కోసం 17 టేక్స్, 2 ఏళ్లు షూటింగ్, ‘All of Us Are Dead’లో ఆసక్తికర సన్నివేశం!
నెట్‌ఫ్లిక్స్‌లో ఉత్కంఠభరిత వెబ్‌సీరిస్ ‘All of Us Are Dead’లోని ఆసక్తికర సన్నివేశాల గురించి నటీనటులు ఏమన్నారో చూడండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తున్న వెబ్ సీరిస్.. ‘ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్’ (All of Us Are Dead). జాంబీ వైరస్ జోనర్‌లో తెరకెక్కిన ఈ కొరియా వెబ్‌సీరిస్‌లో ప్రతి ఎపిసోడ్‌ను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. సుమారు రెండేళ్లపాటు చిత్రీకరించిన ఈ వెబ్ సీరిస్‌ను 12 ఎపిసోడ్లుగా రిలీజ్ చేశారు. ఓ స్కూల్‌లో జాంబీ వైరస్ వ్యాప్తి చెందితే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆయుధాల్లేని విద్యార్థులు వాటి నుంచి ఎలా తప్పించుకుంటారనేది ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ వెబ్‌సీరిస్‌లో కనిపించిన నటీనటులకు కూడా రాత్రికి పాపులర్ అయిపోయారు. గతేడాది విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ తరహాలోనే ఈ వెబ్ సీరిస్‌కు కూడా మంచి పాపులారిటీ లభిస్తోంది. ఈ సందర్భంగా ‘All of Us Are Dead’ నటీనటులు, దర్శకులు ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సీరిస్ చిత్రీకరణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
ఈ వెబ్‌సీరిస్ చిత్రీకరణకు సుమారు రెండేళ్ల సమయం పట్టిందని దర్శకులు లీ జే క్యో, రచయిత చున్ సుంగ్-ఇల్ తెలిపారు. ఈ సీరిస్‌లోని ప్రధాన పాత్రలు స్కూల్ గోడలకు వేలాడుతూ నడిచే సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం నాలుగు అంతస్థుల స్కూల్ సెట్ వేశామని పేర్కొన్నారు. ఇందులో నటించిన నటీనటులు స్కూల్ పిల్లలు కాదని, అందరి వయస్సు దాదాపు 20 ఏళ్ల కంటే ఎక్కువేనని వెల్లడించారు. ఈ చిత్రాన్ని పెద్దలను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించామన్నారు.
ఆ ముద్దు సీన్‌కు 17 టేకులు: ఇందులో నామ్ రా (చో యి హ్యూన్) మరియు లీ సు-హ్యోక్ (పార్క్ సోలోమన్) మధ్య ఓ లిక్ లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే, ఇది మరీ ఎబ్బెట్టుగా ఉండదు. ఇందులో నామ్ రా పెదాలు.. లీ సు-హ్యోక్ పెదాలను తాకాలి. అయితే, ఈ సీన్ చేయడానికి ఇద్దరు సుమారు 17 టేక్స్ తీసుకున్నారట. దీని గురించి పార్క్ సోలోమన్ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి కిస్సింగ్ సీన్ చేశాను. దీని చిత్రీకరణకు ముందు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. సీన్ చేసిన తర్వాత.. సినిమాల్లో నటీనటులు ఎందుకు ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేస్తారో అర్థమైంది. ఇది నాకు ఇష్టమైన సన్నివేశం’’ అంటూ నవ్వేశాడు. అయితే, ఈ సీన్‌లో అన్ని టేక్స్ తీసుకోడానికి కారణం తానేనని చో యి హ్యూన్ తెలిపింది. ‘‘ఆ సీన్ ప్రకారం నేను కళ్లు మూసుకుని పార్క్ జీ హూను కిస్ చేయాలి. కానీ, నాకు అతడి పెదాలు ఎక్కడ ఉన్నాయో తెలిసేది కాదు. అందుకే, చాలాసార్లు ఆ సీన్ చేయాల్సి వచ్చింది’’ అని తెలిపింది.
మొదట్లో ఈ సీన్ అవసరం లేదని భావించామని రచయిత చున్ సుంగ్-ఇల్ తెలిపారు. అయితే, ఆ ఎపిసోడ్ మరీ సాదాసీదాగా ఉందని భావించి దర్శకుడు ఈ సీన్ కావాలన్నారని పేర్కొన్నారు. దర్శకుడు లీ జే-క్యో మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల మద్య సంఘర్షణను మరింత రక్తికట్టించేందుకు ఈ సన్నివేశాన్ని ఉంచాలని పడ్డుబట్టాను’’ అని తెలిపారు. ఈ సీరిస్‌లో ఇంకా నామ్ ఒంజో (పార్క్ జీ హూ), లీ చియోంగ్సన్ (చాన్ యంగ్ యూన్), లీ నా యోన్ (లీ యు మి), యో గ్వి నామ్ (యూ ఇన్ సూ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి: