News
News
X

Hero Sriram: సెట్‌లో ఫైర్, బట్టలతో పాటు నా చర్మం ఊడొచ్చేసింది.. చెవులు, పెదాలు కోల్పోయా: హీరో శ్రీరామ్

హీరో శ్రీరామ్ ఓ సినిమా షూటింగ్‌లో ఎదురైన చేదు అనుభవం గురించి ‘ఆలీతో సరదాగా’ షోలో వెల్లడించాడు.

FOLLOW US: 

హీరో శ్రీరామ్ గుర్తున్నాడా? ‘రోజా పూలు’, ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థలే వేరులే’, ‘దడ’, ‘నిప్పు’, ‘లై’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్.. తెలుగువాడైనా.. తమిళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘రాగల 24 గంటలు’ సినిమాలో కనిపించిన శ్రీరామ్ ప్రస్తుతం ‘10th క్లాస్ డైరీస్’తోపాటు మరో రెండు తెలుగు చిత్రాలు, పలు తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా శ్రీరామ్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలితో సరదాగా’ కార్యక్రమంలో కనిపించాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో బుధవారం విడుదలైంది. 

ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటని ఆలి అడిగిన ప్రశ్నకు శ్రీరామ్ స్పందిస్తూ.. ‘‘నాన్నగారు తెలుగు కుటుంబానికి చెందినవారు. అమ్మ తమిళనాడులోని కుంభకోణం’’ అని తెలిపారు. మార్నింగ్ ఫోన్ వస్తే నాన్న బాగున్నావా అని తెలుగులో, అమ్మతో తమిళంలో మాట్లాడతానని పేర్కొన్నారు. ‘‘మీకు పెళ్లయ్యిందా?’’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకున్నా... సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్’’ అని శ్రీరామ్ సమాధానం ఇచ్చారు. 

పెళ్లి కాకముందు మీ భార్య మీకు ఎలా పరిచయం అని ఆలి ప్రశ్నించగా.. ‘‘ఓసారి షూటింగ్‌లో ఉన్నప్పుడు మా హీరోయిన్ కాల్ చేసి నా క్లోజ్ ఫ్రెండ్ పుట్టిన రోజు, ఆమె నీకు పెద్ద ఫ్యాన్. నువ్వు రావాలి అని అంది. కానీ, నేను రాను అన్నాను. ఆ తర్వాత ఇంకొంతమంది హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు. ఆమెకు హీరోయిన్లు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చేసుకున్నా. హీరోలు ఫ్రెండ్స్ ఉంటే చేసుకొనేవాడినా??’’ అని శ్రీరామ్ ఫన్నీగా బదులిచ్చారు. 

నటుడిని కాకపోతే ‘అంబానీ’ అయ్యేవాడిని: తన ఫస్ట్ పేమెంట్ గురించి శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నగారు సైకిల్ కొని ఇచ్చారు. సైకిల్ ఎందుకు ఖాళీగా ఉండాలనే ఉద్దేశంతో గంటకు రూ.5 చొప్పున అద్దెకు ఇచ్చేవాడిని. నాది బిజినెస్ మైండి. అంబానీ అయ్యుండాలి. నటుడిని అయిపోయా’’ అని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పెద్ద హీరోను కలవడానికి వెళ్లినప్పుడు.. ఆయనే వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకున్నారట అని అలీ ప్రశ్నించగా.. ‘‘ఒక్క మూవ్‌‌మెంట్ మానిటర్ చూసి తిరిగి చూసేసరికి రజినీ కాంత్‌గారు మ్యాజిక్‌లాగ ఎక్కడి నుంచో వచ్చేసి వెనుక నుంచి వాటేసుకున్నారు. శ్రీకాంత్ ఎలా ఉన్నావ్, బాగున్నావా? నా గెటప్ ఎలా ఉంది, బయట ఎలా అనుకుంటున్నారు ఈ గెటప్ గురించి అని అడిగారు. మీరు ఎలా వచ్చినా.. బట్టలేసుకున్నా, వేసుకోకపోయినా.. నుంచున్నా, కూర్చున్నా.. ఎలా ఉన్నా బాగుంటారు సార్ అని అన్నాను’’ అని శ్రీరామ్ తెలిపారు. 

ఓ షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం గురించి శ్రీరామ్ చెబుతూ.. ‘‘రబ్బర్ సోల్యూష్ ఎలా ఉంటుందో, నిప్పు ఎంత వరకు వస్తుందో తెలీదు. ఆర్ట్ అసిస్టెంట్ తెలియకుండా ఎక్కువ పోసేశాడు. ఆ మంటలకు బట్టలతో సహా చర్మం వచ్చేసింది. అప్పుడు నాకు లిప్స్, చెవులు, జుట్టు ఉండేది కాదు. చేతులు, కాళ్లు కాలిపోయి హాస్పిటల్‌లో ఉన్నాను’’ అని తెలిపారు. మరి, ఆ గాయాల నుంచి ఎలా కోలుకున్నారో తెలియాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే.

Published at : 09 Feb 2022 07:39 PM (IST) Tags: Hero Sriram Sriram in Alitho Saradaga Hero Sriram Fire Accident Hero Sriram movies హీరో శ్రీరామ్

సంబంధిత కథనాలు

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ -  ఇందులో నిజమెంతా?

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!

Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!

టాప్ స్టోరీస్

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!