అన్వేషించండి
Advertisement
Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్
పూణే సిటీలో 28 ఏళ్ల నటిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పూణే సిటీ పోలీసులు ఓ నటిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సిరీస్ లలో కీలకపాత్రలు పోషించిన ఓ నటి పోలీస్ ఆఫీసర్ ని కరవడంతో వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల యువతి నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని అంధేరిలో నివసిస్తోంది. తన వర్క్ లో భాగంగా ఆమె పూణేకి వెళ్లింది.
అక్కడ స్టే చేయడానికి హోటల్ లో ఆన్ లైన్ ద్వారా రూమ్ బుక్ చేసింది. వడగోయన్ షెరి రీజియన్ లో ఈ హోటల్ ఉంది. పూణే చేరుకున్న నటి హోటల్ కి వెళ్లగా.. ఆమెకి అక్కడ సదుపాయాలు నచ్చలేదు. దీంతో తన డబ్బుని తిరిగి ఇవ్వమని అడిగింది. కాసేపటికి తన సహనం కోల్పోవడంతో మధ్యాహ్నం 1:25 నిమిషాలకు హోటల్ వర్కర్స్ తో గొడవకు దిగింది సదరు నటి.
వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామిని స్క్వాడ్ కి చెందిన లేడీ పోలీస్ ఆఫీసర్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కూడా నటి గొడవకు దిగి.. పర్వీన్ షేక్ అనే పోలీస్ అధికారిని పలుమార్లు కరిచింది. అంతేకాదు ఆమెపై దాడికి పాల్పడింది. దీంతో పోలీస్ అధికారులు సదరు నటిని అరెస్ట్ చేసి.. డ్యూటీలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 353, 332, 427, 504 కింద కేసులు పెట్టారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion