అన్వేషించండి

Ysrcp Candidates List: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ - విద్యార్హతలు, సామాజిక వర్గాల వారీగా!

Andhra News: ఎన్నికల బరిలో నిలిచే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను వైసీపీ విడుదల చేసింది. అన్ని సామాజిక వర్గాలు, ఉన్నత విద్యావంతులు, మహిళలకు పెద్దపీట వేశారని నేతలు తెలిపారు.

Ysrcp Candidates 2024 List Released: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను అధికార వైసీపీ శనివారం విడుదల చేసింది. ఇడుపులపాయలో సీఎం జగన్ (CM Jagan) వైఎస్ సమాధికి నివాళి అర్పించిన అనంతరం.. లిస్ట్ ను ప్రకటించారు. ఎంపీ అభ్యర్థులను వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చదివి వినిపించగా.. ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు మంత్రి ధర్మాన వివరించారు. 200 సీట్లకు గానూ 100 స్థానాల్లో అభ్యర్థులను ఆ వర్గాల నుంచే ఎంపిక చేసినట్లు చెప్పారు. 25 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో ఎస్సీలు - 4, ఎస్టీలు - 1, బీసీలు - 11, ఓసీలకు - 9 స్థానాలు కేటాయించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన మొత్తం 200 స్థానాల్లో ఎస్సీలకు - 33, ఎస్టీలు - 8, బీసీలు - 59, ఓసీలకు - 100 సీట్లు ఇచ్చారు. గతంలో కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈసారి అదనంగా 11 సీట్లు కేటాయించారు. 2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే.. ఈసారి 48 సీట్లు ఇచ్చారు. అప్పట్లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఇప్పుడు 19 స్థానాలు కేటాయించారు. గతంలో 2 మహిళా ఎంపీ స్థానాలు కేటాయించగా.. ఈసారి 3 సీట్లకు పెంచారు. 2019లో మైనార్టీలకు 5 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఇప్పుడు 7 స్థానాలు కేటాయించారు. 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 89 స్థానాలు ఇస్తే ఈసారి ఆయా సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయించారు.

అభ్యర్థుల విద్యార్హతలివే

వైసీపీ విడుదల చేసిన 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారు. 22 మంది డిగ్రీ ఆపై చదువుకున్నవారు కాగా.. ఐదుగుర డాక్టర్లు, నలుగురు లాయర్లు ఉన్నారు. ఓ చార్టర్డ్ అకౌంటెంట్, ఓ మెడికల్ ప్రాక్టీషినర్ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికొస్తే.. 175 మంది అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయించారు. మొత్తంగా 2024 ఎన్నికల బరిలో వైసీపీ తరఫున.. 18 మంది డాక్టర్లు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, రక్షణ శాఖ మాజీ ఉద్యోగి ఒకరు, ఓ జర్నలిస్టు ఉన్నారు. విద్యావంతులకు, అన్ని సామాజిక వర్గాలకు వైసీపీ అధినేత సీఎం జగన్ పెద్దపీట వేశారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

1 ఇచ్ఛాపురం - శ్రీమతి పిరియా విజయ
2 పలాస - శ్రీ సీదిరి అప్పలరాజు
3 టెక్కలి - శ్రీ దువ్వాడ శ్రీనివాస్
4 పాతపట్నం - శ్రీమతి రెడ్డి శాంతి
5 శ్రీకాకుళం - శ్రీ ధర్మాన ప్రసాద రావు
6 ఆమదాలవలస - శ్రీ తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల - శ్రీ గొర్లె కిరణ్ కుమార్
8 నరసన్నపేట - శ్రీ ధర్మాన కృష్ణ దాస్
9 రాజాం - శ్రీ తలే రాజేష్
10 పాలకొండ - శ్రీమతి విశ్వాసరాయి కళావతి
11 కురుపాం - శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల
12 పార్వతీపురం - శ్రీ అలజంగి జోగారావు
13 సాలూరు - శ్రీ పీడిక రాజన్న దొర
14 బొబ్బిలి - శ్రీ శంబంగి వెంకట చిన అప్పల నాయుడు
15 చీపురుపల్లి - శ్రీ బొత్స సత్యనారాయణ
16 గజపతినగరం - శ్రీ  బొత్స అప్పలనరసయ్య
17 నెల్లిమర్ల - శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు
18 విజయనగరం - శ్రీ వీరభద్ర స్వామి కోలగట్ల
19 శృంగవరపుకోట - శ్రీ కడుబండి శ్రీనివాసరావు
20 భీమిలి - శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు
21 విశాఖపట్నం తూర్పు - శ్రీ ఎంవివి సత్యనారాయణ
22 విశాఖపట్నం దక్షిణ - శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ 
23 విశాఖపట్నం ఉత్తరం - శ్రీ కేకే రాజు
24 విశాఖపట్నం పశ్చిమం - శ్రీ అడారి ఆనంద్
25 గాజువాక - శ్రీ గుడివాడ అమర్నాథ్
26 చోడవరం - శ్రీ కరణం ధర్మశ్రీ
27 మాడుగుల - శ్రీ బూడి ముత్యాలనాయుడు
28 అరకులోయ - శ్రీ రేగం మత్స్య లింగం
29 పాడేరు - శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు 
30 అనకాపల్లి - శ్రీ మలసాల భారత్ కుమార్ 
31 పెందుర్తి - శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్
32 ఎలమంచిలి -  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
33 పాయకరావుపేట - శ్రీ కంబాల జోగులు
34 నర్సీపట్నం - శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్
35 తుని - శ్రీ దాడిశెట్టి రాజా
36 ప్రత్తిపాడు (కాకినాడ) - శ్రీ పర్వత పూర్ణ చంద్ర వర ప్రసాద్ 
37 పిఠాపురం - శ్రీమతి వంగా గీత
38 కాకినాడ రూరల్ - శ్రీ కురసాల కన్నబాబు
39 పెద్దాపురం - శ్రీ దవులూరి దొరబాబు
40 అనపర్తి - శ్రీ సత్తి సూర్యనారాయణ రెడ్డి
41 కాకినాడ సిటీ - శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
42 రామచంద్రపురం-  శ్రీ పిల్లి సూర్యప్రకాష్
43 ముమ్మిడివరం - శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్
44 అమలాపురం - శ్రీ పినిపె విశ్వరూప్
45 రాజోలు - శ్రీ గొల్లపల్లి సూర్యారావు
46 గన్నవరం (కోనసీమ) - శ్రీ విప్పర్తి వేణుగోపాల్
47 కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి
48 మండపేట - శ్రీ  తోట త్రిమూర్తులు 
49 రాజానగరం - శ్రీ జక్కంపూడి రాజా
50 రాజమండ్రి సిటీ - శ్రీ మార్గాని భరత్
51 రాజమండ్రి రూరల్ - శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా
52 జగ్గంపేట - శ్రీ తోట నరసింహం
53 రంపచోడవరం - శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి
54 కొవ్వూరు - శ్రీ తలారి వెంకట్రావ్
55 నిడదవోలు - శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు
56 ఆచంట - శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
57 పాలకొల్లు - శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు
58 నరసాపురం - శ్రీ ముదునూరి ప్రసాద రాజు
59 భీమవరం -  శ్రీ గ్రంధి శ్రీనివాస్
60 ఉండి - శ్రీ పివిఎల్ నరసింహ రాజు
61 తణుకు - శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
62 తాడేపల్లిగూడెం - శ్రీ కొట్టు సత్యనారాయణ/ఈలి నాని
63 ఉంగుటూరు - శ్రీ పుప్పాల శ్రీనివాసరావు
64 దెందులూరు - శ్రీ అబ్బయ్య చౌదరి కొఠారి
65 ఏలూరు - శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
66 గోపాలపురం - తానేటి వనతి 
67 పోలవరం - శ్రీ తెల్లం రాజ్య లక్ష్మి 
68 చింతలపూడి - విజయరాజు 
69 తిరువూరు - నల్లగట్ల స్వామిదాసు 
70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు
71 గన్నవరం - శ్రీ వల్లభనేని వంశీ 
72 గుడివాడ - శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
73 కైకలూరు - శ్రీ దూలం నాగేశ్వరరావు
74 పెడన - శ్రీ ఉప్పల రాము
75 మచిలీపట్నం - శ్రీ పేర్ని కృష్ణమూర్తి
76 అవనిగడ్డ - శ్రీ రమేష్ బాబు సింహాద్రి
77 పామర్రు - శ్రీ అనిల్ కుమార్ కైలే
78 పెనమలూరు - శ్రీ జోగి రమేష్
79 విజయవాడ వెస్ట్ - శ్రీ షేక్ అసిఫ్
80 విజయవాడ సెంట్రల్ - శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ 
81 విజయవాడ తూర్పు - శ్రీ దేవినేని అవినాష్
82 మైలవరం - శ్రీ సర్నాల తిరుపతి రావు
83 నందిగామ - శ్రీ మొండితోక జగన్ మోహన రావు
84 జగ్గయ్యపేట - శ్రీ ఉదయభాను సామినేని
85 పెదకూరపాడు - శ్రీ నంబూరు శంకరరావు
86 తాడికొండ - శ్రీమతి మేకతోటి సుచరిత
87 మంగళగిరి - శ్రీమతి మురుగుడు లావణ్య 
88 పొన్నూరు - శ్రీ అంబటి మురళి కృష్ణా
89 వేమూరు - శ్రీ వరుకూటి అశోక్ బాబు
90 రేపల్లె - శ్రీ డా.ఈవూరు గణేష్
91 తెనాలి - శ్రీ అన్నాబత్తుని శివ కుమార్
92 బాపట్ల - శ్రీ కోన రఘుపతి
93 ప్రత్తిపాడు - శ్రీ బాలసాని కిరణ్ కుమార్
94 గుంటూరు వెస్ట్ - శ్రీమతి విడదల రజిని
95 గుంటూరు తూర్పు - శ్రీమతి షాక్ నూరి ఫాతిమా
96 చిలకలూరిపేట - శ్రీ కావటి మనోహర్ నాయుడు
97 నరసరావుపేట - శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
98 సత్తెనపల్లె - శ్రీ అంబటి రాంబాబు
99 వినుకొండ - శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు
100 గురజాల - శ్రీ కాసు మహేష్ రెడ్డి
101 మాచర్ల - శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి
102 యర్రగొండపాలెం - శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్
103 దర్శి - బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి 
104 పర్చూరు - యడం బాలాజీ
105 అద్దంకి - శ్రీ పాణెం హనిమిరెడ్డి
106 చీరాల - కరణం బలరాం/వెంకట్
107 సంతనూతలపాడు - శ్రీ మేరుగు నాగార్జున
108 ఒంగోలు - శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి
109 కందుకూరు - శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్
110 కొండపి - శ్రీ ఆదిమూలపు సురేష్
111 మార్కాపురం - శ్రీ అన్నా రాంబాబు 
112 గిద్దలూరు -  శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి
113 కనిగిరి - శ్రీ దద్దాల నారాయణ యాదవ్
114 కావలి - శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115 ఆత్మకూర్ - శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి
116 కోవూరు - శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
117 నెల్లూరు సిటీ - శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్
118 నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
119 సర్వేపల్లి - శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి 
120 గూడూరు -  శ్రీ మేరిగ మురళి
121 సూళ్లూరుపేట - శ్రీ కిలివేటి సంజీవయ్య
122 వెంకటగిరి - శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
123 ఉదయగిరి - శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
124 బద్వేల్ - శ్రీమతి దాసరి సుధ
125 రాజంపేట - శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 
126 కడప - శ్రీ ఎస్.బి అంజద్ బాషా
127 రైల్వే కోడూరు - శ్రీ కొరముట్ల శ్రీనివాసులు
128 రాయచోటి - శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి
129 పులివెందుల - శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి
130 కమలాపురం - శ్రీ పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
131 జమ్మలమడుగు -శ్రీ మూలే సుధీర్ రెడ్డి
132 ప్రొద్దుటూరు - శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
133 మైదుకూరు - శ్రీ రఘురామిరెడ్డి సెట్టిపల్లి
134 ఆళ్లగడ్డ - శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి
135 శ్రీశైలం - శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి
136 నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా 
137 కర్నూలు - శ్రీ ఎం డి ఇంతియాజ్ 
138 పాణ్యం - శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
139 నంద్యాల - శ్రీ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
140 బనగానపల్లె - శ్రీ కాటసాని రామి రెడ్డి
141 డోన్ - శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్
142 పత్తికొండ - శ్రీమతి కంగాటి శ్రీదేవి
143 కోడుమూరు - శ్రీ డా. సతీష్
144 ఎమ్మిగనూరు - శ్రీమతి బుట్టా రేణుక
145 మంత్రాలయం - శ్రీ వై బాలనాగి రెడ్డి
146 ఆదోని - శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి
147 ఆలూరు - శ్రీ బూసినే విరుపాక్షి
148 రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి
149 ఉరవకొండ - శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి
150 గుంతకల్లు - శ్రీ వై.వెంకటరామ రెడ్డి
151 తాడిపత్రి - శ్రీ కె. పెద్దా రెడ్డి
152 శింగనమల - శ్రీ ఎం వీరాంజనేయులు
153 అనంతపురం అర్బన్ - శ్రీ అనంత వెంకటరామి రెడ్డి
154 కళ్యాణదుర్గం - శ్రీ తలారి రంగయ్య
155 రాప్తాడు - శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
156 మడకశిర - శ్రీ ఈర లక్కప్ప
157 హిందూపురం - శ్రీమతి టి.ఎన్ దీపిక 
158 పెనుకొండ - శ్రీమతి కె. వి. ఉషశ్రీ చరణ్
159 పుట్టపర్తి - శ్రీ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి
160 ధర్మవరం - శ్రీ కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
161 కదిరి - శ్రీ మక్బుల్ అహ్మద్
162 తంబళ్లపల్లె - శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి
163 పీలేరు - శ్రీ చింతల రామచంద్రా రెడ్డి
164 మదనపల్లె - శ్రీ నిస్సార్ అహ్మద్
165 పుంగనూరు - శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
166 చంద్రగిరి - శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
167 తిరుపతి - శ్రీ భూమన అభినయ్ రెడ్డి
168 శ్రీకాళహస్తి - శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి
169 సత్యవేడు - శ్రీ నూకతోటి రాజేష్
170 నగరి - శ్రీమతి ఆర్.కె రోజా
171 గంగాధర నెల్లూరు - శ్రీ మతి లక్ష్మి కృప
172 చిత్తూరు - శ్రీ ఎం విజయానంద రెడ్డి
173 పూతలపట్టు - శ్రీ డా. సునీల్ కుమార్
174 పలమనేరు - శ్రీ ఎన్. వెంకటే గౌడ
175 కుప్పం - శ్రీ కే ఆర్ జే భరత్

ఎంపీ అభ్యర్థులు వీరే

1. శ్రీకాకుళం- పేరాడ తిలక్

2. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్

3. విశాఖ - బొత్స ఝాన్సీలక్ష్మి

4. అరకు - చెట్టి తనూజరాణి

5. కాకినాడ - చెలమలశెట్టి సునీల్

6. అమలాపురం - రాపాక వరప్రసాద్

7.  రాజమండ్రి - డా.గూడూరి శ్రీనివాసులు

8. నర్సాపురం - గూడురి ఉమాబాల

9. ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్

10. మచిలీపట్నం - డా.సింహాద్రి చంద్రశేఖర్

11. విజయవాడ - కేశినేని శ్రీనివాస్ (నాని)

12. నర్సరావుపేట - డా.పి.అనిల్ కుమార్ యాదవ్

13. గుంటూరు - కిలారి వెంకటరోశయ్య

14. బాపట్ల - నందిగం సురేష్ బాబు

15. ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

16. నెల్లూరు - వేణుంబాక విజయసాయిరెడ్డి

17. తిరుపతి - మద్దిల గురుమూర్తి

18. చిత్తూరు - ఎన్.రెడ్డప్ప

19. రాజంపేట - పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి

20. కడప - వైఎస్ అవినాష్ రెడ్డి

21. కర్నూలు - బీవై.రామయ్య

22. నంద్యాల - పోచ బ్రహ్మానందరెడ్డి

23. హిందూపూర్ - జోలదరాశి శాంత

24. అనంతపురం - మాలగుండ్ల శంకరనారాయణ

 

 

 

 

Also Read: YSRCP MLA And MP Candidates : వైసీపీ వారియర్స్‌ వీళ్లే - జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget