(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Elections 2024: ఏక్నాథ్ షిండే Vs దేవందర్ ఫడ్నవీస్- ముఖ్యమంత్రి పదవిపై ఎవరేమన్నారంటే?
Maharashtra Assembly Election 2024 మహారాష్ట్రలో ఓవైపు ఎన్నికల ఫలితాలు వస్తుండగానే మరోవైపు సీఎం పదవిపై చర్చ మొదలైంది. దేవందర్ ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే కీలకవ్యాఖ్యలు చేశారు.
Maharashtra Assembly Election Result 2024: మహారాష్ట్రలో విజయం సాధించిన మహాయుతిలో సీఎం పదవిపై పితలాటకం మొదలైనట్టే కనిపిస్తోంది. కూటమిలో అనూహ్యాంగా భారీ విజయాన్ని బీజేపీ అందుకోవడంతో సీఎం పదవిపై ఆ పార్టీ ఫోకస్ చేసింది. అంతే కాకుండా షిండే నేతృత్వంలోనే శివసేన అనుకున్న మేజార్టి సాధించకపోవడం కూడా ఇక్కడ కీలకంగా మారింది.
సీఎం పదవిపై దేవందర్ ఫడ్నవీస్‌కు కట్టబెట్టాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు గ్రహించిన ఏక్‌నాథ్ షిండే కీలకవ్యాఖ్యలు చేశారు. సీట్లకు సీఎం కుర్చీకి సమబంధం లేదని అన్నారు. మహాకూటమిలో ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ నేతే ముఖ్యమంత్రి కావాలని మేం నిర్ణయించుకోలేదన్నారు షిండే . ముందుగా ఎన్నికల ఫలితాల తుది గణాంకాలను వచ్చాక చర్చిస్తాం. సీట్ల పంపకాల చర్చకు మూడు పార్టీలు కూర్చున్నట్లు కలిసి కూర్చుంటాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, మూడు పార్టీల సీనియర్ నేతలు ఒకే చోట కూర్చుని చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే ముఖ్యమంత్రి పదవిపై కూడా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై తన వాదనను అంత తేలిగ్గా వదులుకోనని ఏకనాథ్ షిండే ప్రకటన సూచిస్తోంది.
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలుచ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించనట్టు వచ్చాయన్నారు. తామెవరూ ఊహించలేదన్నారు. అంచనాలకు మించినవిగా అభిప్రాయపడ్డారు. త్వరలోనే పార్టీ నేతలు కూర్చొని తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేస్తామన్నారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఫడ్నవీస్. మూడు పార్టీలు కలిసి సీఎంను నిర్ణయిస్తాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘తన బిడ్డ తప్పకుండా సీఎం అవుతాడని అన్నారు. ఇది చాలా పెద్ద రోజని అన్నారు. తను 24 గంటలు కష్టపడి పనిచేశాడని గుర్తు చేశారు. మరోవైపు పవార్ ఫ్యామిలీ కూడా అజిత్ పవార్ సీఎం రేసులో ఉంటారని ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి విజయంపై అభినందనలు తెలిపారు.
మహాయుతి శాసనసభా పక్ష సమావేశం ఆదివారం జరగనుంది. నవంబర్ 25న బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక జరగనుంది. నవంబర్ 26న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బీజేపీ పరిశీలకుడు ఆదివారం ముంబైకి రానున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మెజారిటీ మార్కు దాటి దూసుకెళ్లింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 200పైగా స్థానాల్లో విజయం ఢంకా మోగించేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని MVA 58 స్థానాలకే పరిమితమైంది. ఇతరలు 13 స్థానాల్లో ఆధిక్యం కనబరిచారు.
ముంబైలోని 36 సీట్లలో మహాయుతి 22 స్థానాల్లో, MVA 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని 58 సీట్లలో మహాయుతి 34 స్థానాల్లో, ఎంవీఏ 4, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని 47 స్థానాల్లో మహాయుతి 36 స్థానాల్లో, ఎంవీఏ 6, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
థానే కొంకణ్ ప్రాంతంలోని 39 స్థానాల్లో మహాయుతి 33 స్థానాల్లో, ఎంవీఏ 4 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరాఠ్వాడాలోని 46 స్థానాల్లో మహాయుతి 34 స్థానాల్లో, ఎంవీఏ 11 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. విదర్భలోని 62 స్థానాల్లో మహాయుతి 47 స్థానాల్లో, ఎంవీఏ 14 స్థానాల్లో, ఇతరులు 1 సీటులో ఆధిక్యంలో ఉన్నారు.
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!