అన్వేషించండి

Vizianagaram Constituency : అశోక్‌ సంస్థానమైన విజయనగరం స్థానం వచ్చే ఎన్నికల్లో ఎవరి ఆస్థానమయ్యేనో..?

Vizianagaram Constituency : విజయనగరం జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం. ఇప్పటి వరకు ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధిక సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.

Vizianagaram assembly politics : విజయనగరం జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం. విజయనగరం హెడ్‌ క్వార్టర్‌(నగర) పరిధి మొత్తం ఈ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధిక సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు టీడీపికి చెందిన అశోక్‌ గజపతిరాజు విజయం సాధించి రికార్డు సృష్టించారు. నియోజకవర్గ పరిధిలో 2,12,092 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,05,161 మంది పురుష ఓటర్లు ఉండగా, 1,06,928 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తొలి ఎన్నిక 1952లో జరిగింది

ఇదీ ఎన్నికలు జరిగిన తీరు

ఇప్పటి వరకు 18 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నిక 1952లో జరిగింది. ఈ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసిన జి సూర్యనారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సి సూర్యనారాయణపై 41,056 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసిన పీవీ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జి అప్పలస్వామిపై 36,463 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1953లో సభకు ఉపఎన్నిక జరగ్గా పీఎస్పీ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 1955లో జరిగిన ఎన్నికల్లో పీఎస్పీ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బీవీ సంజీవరావుపై 24,128 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1957లో జరిగిన ఉప ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసిన బాట్టం శ్రీరామమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బాట్టం శ్రీరామమూర్తి తన సమీప ప్రత్యర్థి బీజేఎస్‌ నుంచి పోటీ చేసిన వి రామారావుపై 30,649 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 

1967లో జరిగిన ఎన్నికల్లో బీజేఎస్‌ నుంచి పోటీ చేసిన వి రామారావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బాట్టం శ్రీరామమూర్తిపై 18,359 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అప్పసాని అప్పన్నదొర ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీజేఎస్‌ నుంచి పోటీ చేసిన పి అనవిళ్లపై 23,916 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అప్పసాని అప్పన్నదొరపై 26,085 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పీఆర్‌ కృష్ణపై 40,392 ఓట్లతో గెలుపొందారు. 1985లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అశోక్‌ గజపతిరాజు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎంఎస్‌ రావుపై 37,969 ఓట్ల తేడాతో అశోక్‌ గెలుపొందారు. 

Also Read: ఎస్‌ కోట ఎవరికి కోటగా మారుతుందో..!

1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి బరిలోకి దిగిన అశోక్‌ గజపతిరాజు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామిపై 9747 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అశోక్‌ గజపతిరాజు ఐదోసారి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మరోసారి బరిలోకి దిగిన కోలగట్ల వీరభద్రస్వామిపై 21,031 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆరోసారి వరుసగా విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామిపై వరుసగా మూడోసారి 9131 ఓట్ల తేడదాతో విజయం సాధించారు.

Also Read: బొత్స ఇలాకాలో ఈసారి ఎవరు చూపించేను తడాఖా..!

2004లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అశోక్‌ గజతిపరాజు ఓటమి చవి చూశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో 1126 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వీరభద్రస్వామిపై 3282 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మీసాల గీత ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామిపై 15,404 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అతిథి గజపతిరాజుపై 6417 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 

Also Read: నెల్లిమర్లలో రెపరెపలాడే జెండే ఏదో? ఇరు పార్టీలకు కీలకం

అశోక్‌ అడ్డా

విజయనగరం అసెంబ్లీ స్థానం విజయనగరం రాజుల అడ్డాగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు అశోక్‌ గజపతిరాజు ఇక్కడి నుంచి ఏడుసార్లు విజయాన్ని దక్కించుకున్నారు. ఒకేఒక్కసారి ఆమె ఓటమి పాలయ్యారు. గడిచిన ఎన్నికల్లో తన కుమార్తెను ఈ స్థానం నుంచి బరిలోకి దింపారు. ఆమె కూడా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి మరోసారి అశోక్‌ బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేయనున్నారు. వచ్చే ఎన్నిక మరింత ఆసక్తిరకంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: కురుపాం గడ్డ ఎవరికి అడ్డాగా నిలుస్తుందో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget