అన్వేషించండి

Telangana Elections 2023: యువతకు ఉద్యోగాలే తొలి ప్రాధాన్యం, 10 లక్షలలోపు ఉచిత వైద్యం: ఈటల రాజేందర్

Etela Rajender: దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నాడు కేసీఆర్ అని తెలంగాణ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు.

మక్తల్: దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఆరోపణలు చేశారు. మక్తల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి జలంధర్ రెడ్డికి, నారాయణపేట బీజేపీ అభ్యర్థి రతన్ పాండ్ రెడ్డికి మద్దతుగా మక్తల్ సభలో పాల్గొని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల ప్రసంగించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం తమ తొలి ప్రాధాన్యం అన్నారు. 10 లక్షలలోపు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అటుకులు బుక్కి ఉపాసమున్న కేసీఆర్ కి ఇన్ని కోట్లు ఎలా? వచ్చాయని ఈటల రాజేందర్ తెలంగాణ సీఎంను ప్రశ్నించారు. 
దళితబంధు పేరుతో దగా
దళితబంధు పేరుతో దళితులను బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారంటూ ఈటల మండిపడ్డారు. గొల్ల కురుమలు డిడిలు కట్టారు కాని గొర్రెలు ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. మన సొమ్ము పక్క రాష్ట్రాల వారికి ఇవ్వడానికి ఎవడబ్బా జాగీరు కాదు కేసీఆర్. ఇక్కడ చనిపోయిన రైతులను ఆదుకొనే సోయి లేని నువ్వు అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకుంటున్నావు అని సెటైర్లు వేశారు. 

Telangana Elections 2023: యువతకు ఉద్యోగాలే తొలి ప్రాధాన్యం, 10 లక్షలలోపు ఉచిత వైద్యం: ఈటల రాజేందర్

బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామని చెప్పారు. 3100 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర అందిస్తాం. ఒక్క ఎకరానికి 25 వేల రూపాయల లాభం జరుగుతుందన్నారు. వ్యవసాయ పనిముట్లకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని రైతులకు ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ఒక్క సారి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చెయ్యలేదు కానీ, బీసీని సీఎం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని ఈటల గుర్తుచేశారు. 

బీజేపీ వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం. జిఓ no. 69 ఇచ్చి ఎత్తిపోతల పథకం మర్చిపోయారు. బీజేపీ వస్తే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మాదసి కురువలను ఎస్సీలలో చేరుస్తా అని మాట ఇచ్చి నెరవర్చలేదు. మేము వస్తే వారి సమస్య తీరుస్తాం అని పేర్కొన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. 

తెలంగాణ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం అని, తెలంగాణ దిశను మార్చే దశసూత్ర ప్రణాళిక బిజెపి తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో - 2023 అని ఈటల రాజేందర్ అన్నారు. పుట్టిన నవజాత ఆడపిల్లకు 2 లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాం, ఆడపిల్లలకు భరోసా కల్పించిన మన బిజెపి మన మోదీ గ్యారంటీ అని ప్రచారం చేస్తున్నారు. నాలుగు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తాం.. కల్యాణ లక్ష్మి, పింఛన్లు ఏవీ ఆగవు అని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇంట్లో ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ ఇస్తాం.. మీ కుటుంబంలో వైద్యం ఖర్చు మీద పడితే పది లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. పండించే వరి ధాన్యాన్ని కిలో తరుగు లేకుండా గింజ వదిలిపెట్టకుండా కొనే జిమ్మేదార్ తీసుకుంటాం.. గట్టిగా ఉండి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Embed widget