అన్వేషించండి

Telangana Election 2023: సామాన్యుడికి ఎన్నికల కోడ్‌ కష్టాలు- శుభకార్యాలు చేసేవారికి టెన్షన్

ఎన్నికల కోడ్‌తో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్‌ ఒకేసారి రావడంతో శుభకార్యాలు పెట్టుకున్న వారు.. పోలీసుల తనిఖీలతో చుక్కలు చూస్తున్నారు.

తెలంగాణలో వింత పరిస్థితి ఎదురయ్యింది. ఓవైపు ఎన్నికల కోడ్‌.. మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌. రెండు ఒకే సమయంలో రావడంతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  శుభకార్యాలు పెట్టుకున్న వారికి డబ్బుతోనే పని... ఏ పని చేయాలన్న డబ్బు అవసరం. మరోవైపు ఎన్నికల కోడ్... ఎక్కువ డబ్బు బయటకు తీసుకెళ్తే.. సీజ్‌ చేస్తున్నారు  పోలీసులు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

తెలంగాణలో ఇలా ఎన్నికలు కోడ్‌ అమల్లోకి వచ్చిందో లేదో.. అదే సమయంలో పెళ్లిళ్ల సీజన్‌ కూడా ప్రారంభమైంది. అంతేకాదు... ఎన్నిక కౌంటర్‌ పూర్తయ్యే సమయానికి మంచి  మూహూర్తాలు కూడా అయిపోతాయి. దీంతో ఈ సమయంలో శుభకార్యాలు పెట్టుకున్నారు చాలా మంది. మరి.. పెళ్లి అంటే మామూలు విషయం కాదు కదా. అంతా  డబ్బుతోనే పని. షాపింగ్‌ దగ్గర నుంచి... మండపం బుకింగ్‌, మంగళవాయిద్యాలు, కేటరింగ్‌, డెకరేషన్‌ అరేంజ్‌మెంట్స్‌.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటికీ లక్షల రూపాయలు  అవసరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో నగదు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదే.. ఇప్పుడు సమస్యగా మారింది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో పోలీసులు అడుగడుగునా చెకింగ్‌ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్తే వాటికి  రసీదులు అడుగుతున్నారు. ఆధారాలు లేకపోతే నగదును సీజ్‌ చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు... రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా పోలీసులు చెక్‌పోస్టులు  పెట్టి మరీ తనిఖీలు చేస్తున్నారు. బైక్‌లను కూడా వదలడంలేదు. అనధికార లావాదేవీలు ఉంటే.. వెంటనే డబ్బు సీజ్‌చేస్తున్నారు. ఈ పరిస్థితి... పెళ్లిళ్లు పెట్టుకున్న వారికి  ఇబ్బందికరంగా మారింది.

పెళ్లి అంటే.. లక్షల్లో ఖర్చవుతుంది. ఆ డబ్బును... అప్పుగానో.. లేక మరో విధంగానో సమకూర్చుకుంటారు కుటుంబసభ్యులు. అందులో అన్నింటికీ లెక్కలు ఉండవు. ఇక...  పెళ్లిబట్టలు కొన్నాలన్నా లక్ష రూపాయల పైమాటే. ఇక నగల సంగతి చెప్పనక్కర్లేదు. పెద్ద మొత్తం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అయితే.. షాపింగ్‌కు డబ్బుతో వెళ్లే సమయంలో  పోలీసులు ఆపితే... వారి పరిస్థితి ఏంటి. పోలీసులు నచ్చజెప్పి.. డబ్బుతో బయటపడేసరికి తలప్రాణం తొక్కొస్తుంది. ఇలాంటి అనుభవం ఇప్పటికే చాలా మందికి ఎదురైందట.  దీంతో ఇదేం ఎన్నికల కోడ్‌, ఇవేం తిప్పలు అంటూ తలలు పట్టుకున్నారు పెళ్లింటి వారు. పోనీ, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకుందామా  అంటే... ఎన్నికల కోడ్‌ ముగిసే సరికి.. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కోడ్‌ ముగిసే సమయానికి... శుభముహూర్తాలు కూడా అయిపోతాయట. ఇక చేసేది ఏమీ లేక... కోడ్‌  కష్టాలు అనుభవిస్తున్నారట.

ఎన్నికల కోడ్‌ వల్ల.. శుభకార్యాలు పెట్టుకున్న వారికే కాదు... అత్యవసరం కోసం డబ్బులు అప్పుగా ఇచ్చేవారు కూడా... పోలీసుల తనిఖీల వల్ల వెనకడుగు వేస్తున్నారట. ఆ  డబ్బు ఎక్కడిది అని పోలీసులు అడిగితే ఏం చెప్పాలో తెలియక.. అత్యవసరానికి అప్పు అడిగినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారట. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడక  తప్పని పరస్థితి ఏర్పడింది. అత్యవసర ట్రీట్‌మెంట్‌ కోసం హాస్పిటల్స్లో బిల్లులు చెల్లించేందుకు కూడా కొందరు కష్టాలు పడుతున్నారు. దాచుకున్న సోమ్ముకు ఆధారాలు ఎక్కడి నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Fake PM Kisan Yojana App: ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
JEE Main Correction Window: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల సవరణ ప్రారంభం, తప్పులుంటే సరిచేసుకోండి
జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల సవరణ ప్రారంభం, తప్పులుంటే సరిచేసుకోండి
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Embed widget