అన్వేషించండి

Kamareddy Election: కామారెడ్డి జిల్లాలో కారు జోరేనా - కేసీఆర్‌ పోటీతో రాజకీయ లెక్కలు మారుతాయా.?

కామారెడ్డి జిల్లాలో ఈసారి ఎన్నికల రాజకీయం పీక్స్‌లో ఉంది. ఈ జిల్లా నుంచి హేమాహేమీలు పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని బరిలోకి దిగుతున్నారు.

కామారెడ్డి... సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ముందు నుంచి కాంగ్రెస్‌కు పట్టుంది. ఈ నియోజకవర్గంలో మైనారిటీలు, బీసీ సామాజిక వర్గాల బలం ఎక్కువ.  ఈసారి సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతుండటంతో... ఎన్నికల సమరం రసవత్తరంగా మారనుంది. కామారెడ్డి.. గతంలో నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఉండేది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు కాగా.. కామారెడ్డి మున్సిపాలిటీ. కామారెడ్డి, దోమకొండ, బికనూర్, మాచారెడ్డి పాత మండలాలు కాగా..  రాజంపేట, బిపి పేట కొత్త మండలాలు. 1952లో ఏర్పడిన కామారెడ్డి నియోజకవర్గంలో.. 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 8 సార్లు, టీడీపీ ఐదు సార్లు, టీఆర్‌ఎస్‌ 3 సార్లు, ఇండిపెండెంట్లు ఒకసారి గెలిచారు. ఒకసారి ఉపఎన్నిక జరిగింది. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి బీఆర్‌ఎస్‌దే. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ గెలిచారు.  2012 ఉపఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరఫున గంప గోవర్దన్ గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్‌కు 68,167 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ  53,610 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో గంప గోవర్దన్ 8,557 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

జుక్కల్‌.. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. 1957లో ఏర్పడింది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మార్చారు. జుక్కల్‌ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఈ  నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. వాటిలో నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లంపాత పాతమండలాలు కాగా... పెద్ద కొడపగల్ కొత్తగా చేరింది. ఇది మంజీరా నది పరివాహక ప్రాంతం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు కలిగి ఉంటుంది. జుక్కల్‌ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,92,049. వీళ్లలో పురుషులు 94,988, స్త్రీలు  97,061 మంది. గత రెండు ఎన్నికల్లో జుక్కల్‌లో కారు జోరు కొనసాగింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతు షిండే గెలిచారు. 2009లో హనుమంత్‌ షిండే టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2014 కంటే ముందే పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు టీఅర్ఎస్‌ లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్  షిండే.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.గంగారాంపై విజయం సాధించారు. హనుమంత్ షిండేకు 72,901 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.గంగారాంకు 37,394 ఓట్లు వచ్చారు. షిండే 35  వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి హనుమంతు షిండే 77,584 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.గంగారాం 49,959 ఓట్లు సాధించారు. 2023లో కూడా బీఆర్ఎస్ టికెట్ షిండేకు దక్కింది. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు గట్టి పట్టుంది.

బాన్సువాడ... నిజామాబాద్ జిల్లాలోని ఆరు మండలాలు, కామారెడ్డి జిల్లాలోని మూడు మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడుసార్లు, టీడీపీ ఆరుసార్లు, టీఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య..  1,87,461. వీరిలో పురుషులు 89,793, స్త్రీలు 97,668 మంది. 2014, 2018లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డిదే విజయం. టీడీపీలో ఉన్నప్పుడు  కూడా పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గంలో పట్టుంది. 1994 నుంచి 2004 వరకు, 2009 నుంచి 2018 వరకు ఈ నియోజకవర్గం నుంచి పోచారం ప్రాతినిథ్యం వహించారు. మొత్తంగా 5సార్లు గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుపై విజయం సాధించారు. పోచారం  శ్రీనివాసరెడ్డికి 65,868 ఓట్లు రాగా, 41,938 ఓట్లు లభించాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి 77,943 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి  కాసుల బాలరాజుకు 59,458 ఓట్లు లభించాయి. పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ హయాంలో మంత్రిగా చేశారు. ఇప్పుడు శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. 2023లోనూ బీఆర్‌ఎస్‌ ఆయనకే టికెట్‌ ఇచ్చింది.

ఎల్లారెడ్డి నియోజకవర్గం.. 1962 నుంచి 1972 వరకు ఇది ఎస్సీ రిజర్వుడ్‌. 1978లో జనరల్ కేటగిరీకి మార్పు చేశారు. ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. వాటిలో ఎల్లారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, సదాశివ నగర్, నాగిరెడ్డిపేట్, గాంధారి పాత మండలాలు కాగా... కొత్త మండలం రామారెడ్డి ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఎస్టీ, బీసీ, సామాజిక వర్గాలు బలమైనవి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2014లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి గెలుపొందగా, 2018‌లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్‌కు 92,000 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి 56 వేల ఓట్లు వచ్చాయి. జాజుల సురేందర్‌ 36,000 ఓట్ల మెజారిటీలో గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు గాను బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని జాజుల సురేందర్‌కు కేటాయించారు. 2018‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన  జాజుల సురేందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో.. ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌రెడ్డితో కలిసి బీజేపీలో చేరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Jammu And Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
Oil Pulling Benefits : ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
Embed widget