అన్వేషించండి

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత రెడ్డి జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదే!

Telangana News: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 19 (శుక్రవారం) నుంచి ఆయన పర్యటన సాగనుంది. అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలతో సహా బహిరంగ సభల్లోనూ సీఎం పాల్గొంటారు.

CM Revanth Reddy District Tour: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) శుక్రవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. సీఎం 2 రోజుల కేరళ పర్యటన గురువారంతో పూర్తైంది. శుక్రవారం మహబూబ్ నగర్ (Mahabubnagar)లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొని, అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడతారు. సాయంత్రం మహబూబాబాద్  లో జరిగే సభకి హాజరు కానున్నారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 22న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. ఈ నెల 23న నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు.

'20 ఏళ్లు ప్రధానిగా రాహుల్'

సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కేరళ పర్యటనలో భాగంగా.. వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభల్లో సీఎం పినరయి విజయన్ పై విమర్శలు గుప్పించారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని.. వచ్చే 20 ఏళ్లు రాహుల్ భారత ప్రధానిగా ఉంటారని అన్నారు. పినరయి విజయన్ కమ్యూనిస్టు నాయకుడు కాదని.. మోదీకి మద్దతు ఇచ్చే నాయకుడని విమర్శించారు. అటు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తోన్న అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు.

ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. అటు తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. పలువురు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా సీఎం రేవంత్ ర్యాలీలో పాల్గొనడమే కాకుండా.. బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలోనూ కనీసం మూడు చోట్ల సీఎం సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: KCR Key Comments : 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు - బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget