అన్వేషించండి

వలస వెళ్లిన ఓటర్ల కోసం పార్టీల అన్వేషణ, ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. మూడోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్‌ ప్రచారం చేస్తోంది. 9 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ కేసీఆర్‌కు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా పని చేస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ముచ్చటగా మూడోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్‌ ప్రచారం చేస్తోంది. 9 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌...ఈ సారి ఎలాగైనా కేసీఆర్‌కు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా పని చేస్తోంది. అటు బీజేపీ సైతం అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో పని చేస్తోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు పక్కా వ్యూహాలతో పని ముందుకెళ్తున్నాయి. గెలుపోటముల్లో కీలక పాత్ర వహించే వలస ఓటర్ల సమాచార సేకరణపై పార్టీలు దృష్టి సారించాయి. తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది వలస ఓటర్లు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి వారి సామాజికవర్గానికి చెందిన సంఘాలతో ప్రధాన పార్టీల నాయకులు మంతనాలు చేస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైతే ప్రచారంలో తీరికలేకుండా ఉంటామని భావిస్తున్న నేతలు...ఇప్పటి నుంచే వారితో మంతనాలు సాగిస్తున్నారు. వలస వెళ్లిన వారు అనుకున్న సమయానికి పోలింగ్‌కు వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. 

గతేడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో వలస ఓటర్లను ఆకర్షించిన ఓ ప్రధాన పార్టీ...తమ గెలుపునకు అదే వ్యూహాలను అమలు చేస్తోంది. అవసరం అయిన చోట్ల గంపగుత్తగా...లేదంటే ఓటర్ల వారీగా డబ్బు ముట్టజెప్పేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. ప్రస్తుతం జాబితా తయారీలో నిమగ్నమైన బృందాలు...త్వరలోనే పూర్తి నివేదికను అభ్యర్థులకు అందజేయనున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వలస ఓటర్ల చిరునామాల సేకరణకు ఓ ప్రధాన పార్టీ ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రతి గ్రామంలో ఇద్దరి నుంచి ముగ్గురు సభ్యులు బృందంగా ఏర్పడి...గ్రామాల వారీగా ప్రతి వలస ఓటరు చిరునామా, ఫోన్‌ నంబరుతో ఓ డేటాబేస్‌ను తయారు చేస్తున్నారు. ప్రత్యేక బృందానికి రెండు నెలల పాటు నెలవారీ వేతనం ఇస్తున్నారు. 

సామాజికవర్గాల వారీగా లెక్కలు

నివేదిక ప్రకారం సామాజికవర్గాల వారీగా ఎంత మంది ఓటర్లున్నారో తెలుసుకొని వారందరూ తమకు మద్దతిచ్చేలా ఆయా వర్గాల నాయకులతో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు తేలిన తర్వాతే తాము ఏ పార్టీకి మద్దతిస్తామన్న అంశంపై చెబుతామని కుల సంఘాల నేతలు చెబుతున్నారు. వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ఓ మండలంలోని ఆయా గ్రామాల్లోని ఓటర్ల చిరునామాల సేకరణ ఓ బృందాన్ని నియమించుకున్నారు. వారికి భారీ ప్యాకేజ్‌ని సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఓటర్లను స్వస్థలాలకు ఎన్నికల సమయంలో తీసుకురావడానికి సైతం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పార్టీ నుంచి టిక్కెట్‌ దక్కించున్న ఓ నాయకుడు సైతం వలస ఓటర్ల జాబితాను తయారు చేసే పనిని ఎన్నికల బృందానికి అప్పగించారు.

మునుగోడులో 40 వేల వలస ఓటర్లు

అత్యధికంగా మునుగోడులో సుమారు 40 వేలకుపైగా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కతేల్చాయి. వీరంతా హైదరాబాద్‌, భీవండి, ముంబయి, సూరత్‌, షోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో బతుకుదెరువుకు వెళ్లారు. మునుగోడు తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో సుమారు 25 వేల వరకు వలస ఓటర్లు ఉంటారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. వీరంతా హైదరాబాద్‌, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వలసవెళ్లారు. వలస ఓటర్లతో ఇప్పటి నుంచే టచ్‌లో ఉంటూ ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందుగానే స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు, గతంలో పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వారిని ప్రచారానికి సైతం రావాలని ఆహ్వానిస్తున్నారు. వారికి ఇస్తామన్న మొత్తాన్ని అక్కడికక్కడే ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడటం లేదు. 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget