అన్వేషించండి

తెలంగాణ ఎన్నికల వేళ కర్ణాటక సమస్యలపై ప్రచారం- బీఆర్‌ఎస్‌ న్యూ స్ట్రేటజీ

గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ మండలానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. నోటిఫికేషన్ విడుదల కాకముందే దూకుడుగా వ్యవహరిస్తున్న గులాబీ పార్టీ...నోటిఫికేషన్ వచ్చాక జెట్ స్పీడ్ తో ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ మండలానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ స్ట్రాటజీ మార్చేసింది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలంతా హస్తం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఇతరం నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. 

తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక రైతుల ఆందోళన
కర్ణాటక తరహాలోనూ తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఇచ్చింది. తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆరు హామీలను ప్రకటించారు. ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. దేశంలో ఎక్కడ 24 గంటల ఇవ్వడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24గంటల కరెంటును రైతులుకు ఇస్తున్నామని పదే పదే ప్రకటిస్తున్నారు. బహిరంగ సభలు, ప్రెస్ మీట్లలోనూ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు.  కరెంట్ రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి...మాట తప్పారని విమర్శిస్తున్నారు. ఆఖరికి రైతులంతా కలిసి కరెంట్ కోసం రోడ్లెక్కిఆందోళనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు సబ్ స్టేషన్ల దగ్గరకు వచ్చి మొసళ్లు వదులుతున్నారని ప్రజలకు చెబుతున్నారు. కర్ణాటకలోనే హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎలా అమలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతల విమర్శలతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోనూ కొందరు రైతులు, హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లయింది. 

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది  ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget