MP Candidates List: ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే
MP candidates List : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. పార్లమెంట్ స్థానాలపైనా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశాయి.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఒకవైపు అసెంబ్లీకి బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతూనే.. పార్లమెంట్ స్థానాలపైనా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశాయి. ఆర్థిక, అంగ బలం, కుల సమీకరణాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశాయి. అధికార వైసీపీ కొద్దిరోజులు కిందట 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, తాజాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించేశాయి. ఇటు వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి.
ఆసక్తిని రేపుతున్న పోటీ
రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాల్లో పోటీ అనేక చోట్ల ఆసక్తిని రేపుతోంది. శ్రీకాకుళం(Srikakulam Parliament Constituency ) నుంచి మరోసారి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinajarapu Ram Mohan Naidu)బరిలోకి దిగుతున్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)పై రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. మూడోసారి విజయమే లక్ష్యంగా రామ్మోమన్ నాయుడు బరిలోకి దిగుతుండగా, వైసీపీ నుంచి బలమైన అభ్యర్థిగా పేరాడ తిలక్(Perada Tilak)ను బరిలోకి దించుతున్నారు. ఇక్కడ పోటీ ఆసక్తిని కలిగిస్తోంది.
లోక్‌సభ అభ్యర్థులు
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
శ్రీకాకుళం | పేరాడ తిలక్ | రామ్మోహన్ నాయుడు(టీడీపీ) |
విజయనగరం పార్లమెంట్ స్థానం (Vizianagaram Parliament Constituency )నుంచి సిటింగ్ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్(Bellana Chandra Sekhar )ను ఆ పార్టీ మరోసారి బరిలోకి దించుతోంది. టీడీపీ నుంచి కొత్త అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడిన కలిశెట్టి అప్పలనాయుడి(Kalisetti Appalanaidu)ని ఎంపీగా నిలుపుతోంది. విశాఖపట్నం (Visakha Parliament Constituency )ఎంపీగా వైసీపీ బొత్స ఝాన్సీలక్ష్మి(Botsa Jhansi Laxmi)ని బరిలో నిలిపింది. గతంలో విజయనగరం నుంచి రెండుసార్లు పార్లమెంట్ స్థానానికి ఈమె ఎంపికయ్యారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మాత్కుమిల్లి భరత్(Matukumilli Bharat) పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఈయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోసారి అధృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
విజయనగరం | బెల్లాన చంద్రశేఖర్ | కలిశెట్టి అప్పలనాయుడు(టీడీపీ) |
విశాఖ | బొత్స ఝాన్సీలక్ష్మి | మాత్కుమిల్లి భరత్(టీడీపీ) |
అనకాపల్లి పార్లమెంట్ స్థానం(Anakapalli Parliament Constituency ) నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu)ను వైసీపీ బరిలో దించుతోంది. ఈయనపై కూటమిగా అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్ (Ramesh)పోటీ చేయబోతున్నారు. గతంలో సీఎం రమేష్ టీడీపీలో రాజ్యసభ ఎంపీగా పని చేశారు. అరకు ఎంపీ(Araku Parliament Constituency ) గా శెట్టి తనూజరాణి(Chetti Tanuja Rani)కి వైసీపీ అవకాశం కల్పించింది. కూటమిగా అభ్యర్థిగా బీజేపీకి చెందిన కొత్తపల్లి గీత(Kothapalli Geetha) పోటీ చేయబోతున్నారు. గతంలో ఈమె వైసీపీ నుంచి ఇదే స్థానంలో ఎంపీగా గెలిచి బీజేపీ గూటికి చేరారు. కాకినాడ ఎంపీ(Kakinada Parliament Constituency ) గా వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్(Chalamalasetty Sunil) పోటీ చేస్తున్నారు. గతంలో 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. మరోసారి వైసీపీ ఈయనకు అవకాశం కల్పించింది. కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Uday Kumar) పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
అనకాపల్లి | బూడి ముత్యాలనాయుడు | సీఎం రమేష్(బీజేపీ) |
అరకు | శెట్టి తనూజరాణి | కొత్తపల్లి గీత(బీజేపీ) |
కాకినాడ | చలమశెట్టి సునీల్ | తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ |
అమలాపురం(Amlapuram Parliament Constituency ) పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాదరావు (Rapaka Pasada Rao)పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గంటి హరీష్ మాధుర్(Ganti Harish Madhur ) పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నారు. రాజమండ్రి ఎంపీ (Rajahmundry Parliament Constituency ) అభ్యర్థిగా వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాసరావు (Guduru Srinivasa Rao) పోటీ చేస్తున్నారు. తొలిసారి ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న ఈయనపై కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari ) పోటీ చేస్తున్నారు. గతంలో ఈమె విశాఖపట్నం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగాను పని చేశారు. వీరి మధ్య పోటీ ఆసక్తిని రేపుతోంది.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
అమలాపురం | రాపాక వరప్రసాదరావు | గంటి హరీష్ మాధుర్ (టీడీపీ) |
రాజమండ్రి | గూడూరు శ్రీనివాసరావు | పురందేశ్వరి(బీజేపీ) |
నరసాపురం ఎంపీ (Narsapuram Parliament Constituency ) అభ్యర్థిగా వైసీపీ గూడూరు ఉమా బాల(Guduru Uma Bala)ను బరిలోకి దించింది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Bhupatiraju Srinivas Varma) పోటీ చేస్తున్నారు. ఏలూరు (Eluru Parliament Constituency ) నుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ (Karumuri Sunil Kumar Yadav)పోటీ చేస్తున్నారు. ఈయనపై కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన పుట్టా మహేష్ యాదవ్ (Putta Mahesh Yadav)పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నారు. మచిలీపట్నం (Machilipatnam Parliament Constituency ) నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్(Simhadri Chandrasekhara Rao) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balasouri) బరిలోకి దిగుతున్నారు. ఈయన గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
నరసాపురం | ఉమా బాల | భూపతిరాజు శ్రీనివాస వర్మ (బీజేపీ) |
ఏలూరు | కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ | పుట్టా మహేష్ యాదవ్ (టీడీపీ) |
మచిలీపట్నం | డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ | వల్లభనేని బాలశౌరి(జనసేన) |
విజయవాడ (Vijayawada Parliament Constituency )వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ కేశినాని నాని (Kesineni Nani) Kesineni Srinivas బరిలోకి దిగుతున్నారు. గతంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఈయన మూడోసారి విజయాన్ని దక్కించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈసారి అధికారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నాని సోదరుడు కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) Keshineni Shivnath పోటీ చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ స్థానం (Guntur Parliament Constituency )నుంచి వైసీపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోశయ్య(Kilari Venkata Rosaiah) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ Pemmasani Chandrasekhar బరిలోకి దిగుతున్నారు. నరసారాపుపేట ఎంపీ (Narasaraopeta Parliament Constituency )అభ్యర్థిగా కూటమి నుంచి సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయాలు(Lavu Srikrishna Devarayalu) బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఈయన.. ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Poluboina Anil Kumar Yadav) పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
విజయవాడ | కేశినాని నాని | కేశినేని శివనాథ్(టీడీపీ) |
గుంటూరు | కిలారి వెంకట రోశయ్య | పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ) |
నరసారాపుపేట | అనిల్ కుమార్ యాదవ్ | లావు శ్రీకృష్ణదేవరాయాలు(టీడీపీ) |
బాపట్ల ఎంపీ (Bapatla Parliament Constituency )అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ నందిగాం సురేష్(Nandigam Suresh Babu)ను వైసీపీ మరోసారి బరిలోకి దించుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి టి కృష్ణ ప్రసాద్ (Krishna Prasad)పోటీ చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ స్థానం (Nellore Parliament Constituency )ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇక్కడ ఇద్దరు పెద్ద రెడ్లు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ, వైసీపీలో నెంబర్-2గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy)పోటీ చేస్తుండగా, కూటమి నుంచి మొన్నటి వరకు వైసీపీలో ఉండి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy )పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
బాపట్ల | నందిగాం సురేష్ | టి కృష్ణ ప్రసాద్(టీడీపీ) |
నెల్లూరు | విజయసాయిరెడ్డి | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(టీడీపీ) |
ఒంగోలు (Ongole Parliament Constituency )ఎంపీగా టీడీపీ నుంచి సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Srinivasula Reddy )బరిలోకి దిగుతుండగా, వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy) పోటీ చేస్తున్నారు. తిరుపతి ఎంపీ (Tirupati Parliament Constituency )అభ్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తి (Maddila Gurumurthy )పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి వరప్రసాదరావు (Varaparasada Rao)పోటీ చేస్తున్నారు. చిత్తూరు (Chittoor Parliament Constituency )నుంచి సిటింగ్ ఎంపీ ఎన్ రెడ్డప్ప( Reddappa )ను వైసీపీ బరిలోకి దించుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన దగ్గుమళ్ల ప్రసాదరావు (Daggumalla Prasada Rao)పోటీ చేస్తున్నారు. రాజంపేట ఎంపీ (Rajampeta Parliament Constituency )స్థానానికి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (P. V. Midhun Reddy )మరోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి మూడోసారి విజయంపై కన్నేశారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ నుచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Kiran Kumar Reddy) పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
ఒంగోలు | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి | మాగుంట శ్రీనివాసులరెడ్డి(టీడీపీ) |
తిరుపతి | మద్దిల గురుమూర్తి | వరప్రసాదరావు(బీజేపీ) |
చిత్తూరు | ఎన్ రెడ్డప్పను | దగ్గుమళ్ల ప్రసాదరావు(టీడీపీ) |
కడప పార్లమెంట్ (Kadapa Parliament Constituency )స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి(Avinash Reddy ) పోటీ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి విజయాన్ని దక్కించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన చడిపిరాళ్ల భూపేష్‌రెడ్డి (Chadipiralla Bhupesh Reddy )పోటీ చేస్తున్నారు. కర్నూలు (Kurnool Parliament Constituency) నుంచి వైసీపీ అభ్యర్థిగా బీవై రామయ్య (BV Ramaiah )పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు) (Bastipati Nagaraju)పోటీకి చేయబోతున్నారు. నంద్యాల (Nandyala Parliament Constituency )పార్లమెంట్ స్థానానికి వైసీపీ నుంచి పోచం బ్రహ్మానందరెడ్డి (Piocham Bramhananda Reddy )పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి బైరెడ్డి శబరి(Byreddy Shabari) పోటీ చేయబోతోంది. హిందూపూర్ (Hindupur Parliament Constituency )ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి శాంతి జొలదల(J. Sahanti ) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి (BK Partha Sarathi )పోటీ చేస్తున్నారు. అనంతపురం ఎంపీ (Anantapuram Parliament Constituency )స్థానానికి వైసీపీ నుంచి నల్లగొండ్ల శంకర నారాయణ (Shankar Narayana )పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి అంబికా లక్ష్మినారాయణ (Ambika Lakshmi Narayana )పోటీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక పార్లమెంట్ స్థానాల్లో పోటీ ఈసారి ఆసక్తిని రేపుతోంది.
నియోజకవర్గం | వైసీపీ | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) |
కడప | వైఎస్ అవినాష్ రెడ్డి | చడిపిరాళ్ల భూపేష్‌రెడ్డి (టీడీపీ) |
కర్నూలు | బీవై రామయ్య | బస్తిపాటి నాగరాజు(టీడీపీ) |
నంద్యాల |
పోచం బ్రహ్మానందరెడ్డి | బైరెడ్డి శబరి(టీడీపీ) |
హిందూపూర్ |
శాంతి జొలదల | బీకే పార్థ సారథి(టీడీపీ) |
అనంతపురం | నల్లగొండ్ల శంకర నారాయణ | అంబికా లక్ష్మినారాయణ(టీడీపీ) |