అన్వేషించండి

Andhra Modi Tour : ఏపీలో ప్రధాని మోదీ ప్రచార షెడ్యూల్ ఖరారు - ఎప్పుడు , ఎక్కడ సభలు అంటే ?

Andhra News : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఆరు, ఎనిమిది తేదీల్లో పర్యటించనున్నారు.

Eletions 2024 :  ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత మోడీ మళ్లీ ఈ నెల 6, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు.  రోడ్ షోలు, బహిరంగ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‎తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది.  మే 6న మధ్యాహ్నం మూడు గంటలకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. అక్కడినుండి చంద్రబాబు, పవన్‎లతో కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల  కోసం ప్రచారం చేయనున్నారు.                                                

రాజమండ్రిలో సభ తర్వాత సాయంత్రం 5.45 గంటల విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో  రోడ్ షో నిర్వహించనున్నారు. అనకాపల్లిలో కూడా  చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. ఏడో తేదీన ఇతర రాష్ట్రాల్లో మోదీ పర్యటించున్నారు.  మే 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీ పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద ఏర్పాటుచేసి బహిరంగ సభలో పాల్గొంటారు.  తర్వాత  5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ మూడు సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయనున్నారు.                                             

మోదీ పర్యటనలో ఎలాంటి లోపాలు లేకండా  అన్ని భద్రతాపరమైన చర్యలను  పోలీసులు చేపట్టారు. బీజేపీ పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే ప్రధానంగా ప్రచారం చేయనున్నారు. అయితే ఆయన ఎక్కడ ప్రచారం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొదటి సారిగా చిలుకలూరిపేట బహిరంగసభకు  మోదీ హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఏపీలో నాలుగోవిడత పోలింగ్ జరుగుతూంటంతో.. మొదటి మూడు విడతలల్లో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.                   

నాలుగో విడతలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతూండటంతో మోదీ తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. రెండు రోజులకిందట మోదీ జహీరాబాద్ బహిరంగసభలో ప్రకటించారు. పదోతేదీన మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. పదకొండో తేదీన నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. ఆ లోపు రెండు సభల్లో ప్రసంగించే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
AP Local Body Elections: స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Embed widget