అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: విజయ్‌కు 12 సీట్లు తక్కువే - తమిళనాడులో రాష్ట్రపతి పాలన తప్పదా?

Tamil Nadu: తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు అవకాశం కనిపిస్తోంది. ఇతర కూటముల్లోని పార్టీలు విజయ్ వైపు చేరితేనే ఆయనకు మెజార్టీ లభిస్తుంది. అయితే మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడం అంత తేలిక కాదు.

Tamil Nadu President rule:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠకు దారితీశాయి. మొత్తం 234 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన  మేజిక్ ఫిగర్ 118  కాగా, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే  106 స్థానాల వద్దే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మెజారిటీకి కేవలం 12 స్థానాల దూరంలో విజయ్ నిలిచిపోవడంతో, ఇప్పుడు రాష్ట్రం  హంగ్  ముంగిట నిలిచింది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోతే, తమిళనాట  రాష్ట్రపతి పాలన  విధించే ప్రమాదం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 రాజ్యాంగం ఏం చెబుతోంది? 

భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 356  ప్రకారం, ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు  రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో, గవర్నర్ ముందుగా అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. అయితే, బలనిరూపణకు అవసరమైన 12 మంది అభ్యర్థుల మద్దతును విజయ్ సేకరించలేకపోతే, ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీకి ఆ అవకాశం దక్కుతుంది. ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నట్లు గవర్నర్ నిర్ధారణకు వస్తే, ఆయన కేంద్రానికి రాష్ట్రపతి పాలన కోసం సిఫార్సు చేస్తారు.

 గవర్నర్ విచక్షణాధికారం -  సిట్యుయేషనల్ డిస్క్రిషన్ 

హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు గవర్నర్ తన విచక్షణాధికారాన్ని  ఉపయోగిస్తారు. సర్కారియా కమిషన్ , బొమ్మై తీర్పు మార్గదర్శకాల ప్రకారం,  
1. ఎన్నికల ముందే  ఏర్పడిన కూటమికి  ,
2. అతిపెద్ద ఏకైక పార్టీకి ,
3. ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ, విజయ్‌తో చేతులు కలిపేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ఆసక్తి చూపని పక్షంలో, డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలు  కాంగ్రెస్, లెఫ్ట్ నిర్ణయాత్మక శక్తిగా మారతాయి. వారు కూడా మద్దతు ఇవ్వకపోతే రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది.

 ముగిసిన ద్రవిడ ఆధిపత్యం - మొదలైన అనిశ్చితి 

తమిళనాడు చరిత్రలో దశాబ్దాల పాటు సాగిన ద్విముఖ రాజకీయాలకు ఈ ఫలితాలు ముగింపు పలికాయి. అయితే, కొత్త శక్తిగా ఉద్భవించిన విజయ్ కి  ప్రజాధరణ  ఉన్నా  మెజారిటీ  లేకపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అన్నాడీఎంకే, డీఎంకేలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పట్టుబడుతున్న వేళ, విజయ్ కి మద్దతు ఇవ్వడం అంటే తమ గొయ్యి తామే తవ్వుకోవడమని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ రాజకీయ పంతాల మధ్య సామాన్య ఓటరు తీర్పు ఇప్పుడు గందరగోళంలో పడింది.

 రాష్ట్రపతి పాలన విధిస్తే ఆరు నెలల తర్వాత ఎన్నికలు

ఒకవేళ ఆర్టికల్ 356 అమలులోకి వస్తే  రాష్ట్ర పరిపాలన నేరుగా గవర్నర్ చేతుల్లోకి వెళ్తుంది. కేంద్రం తరపున గవర్నర్ అడ్వైజర్ల సహాయంతో పాలన సాగిస్తారు. అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో  ఉంచుతారు. ఈ కాలంలో ఏవైనా కొత్త సమీకరణాలు ఏర్పడి, ఎవరైనా మెజారిటీ నిరూపించుకుంటేనే మళ్ళీ ఎన్నికైన ప్రభుత్వం కొలువుదీరుతుంది. లేనిపక్షంలో ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.

 మున్ముందు ఏం జరగబోతోంది? 

విజయ్ ఇప్పుడు  కింగ్  అవుతారా లేక  కింగ్ మేకర్ల  దయపై ఆధారపడతారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చినా మ్యాజిక్ ఫిగర్ రావడం కష్టం అవుతుంది.  ఒకవేళ అలా జరగకపోతే, తమిళనాడులో కొంతకాలం పాటు రాజకీయ శూన్యం ఏర్పడి, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, తమిళ ఓటరు మార్పు కోరుకున్నా.. అది స్థిరమైన ప్రభుత్వానికి దారితీస్తుందా? లేక రాజకీయ గందరగోళానికా? అన్నది సాయంత్రానికి వెలువడే తుది లెక్కలు, ఆపై జరిగే రాజకీయ బేరసారాల మీద ఆధారపడి ఉంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget