అన్వేషించండి

పాడేరు రాజకీయ ముఖచిత్రం ఇదే

Paderu Political History: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం పాడేరు. జిల్లాల విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేరింది. నియోజకవర్గంలో 2,41,445 మంది ఓటర్లు ఉన్నారు.

Paderu News: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం పాడేరు. జిల్లాలు విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నియోజకవర్గం చేరింది. పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటిలో పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, జికే వీధి, కొయ్యూరు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,41,445 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,17,530 మంది కాగా, మహిళా ఓటర్లు 1,23,909 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తొలిసారిగా 1952 లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగాయి. 

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవే

పాడేరు నియోజకవర్గంలో తొలిసారిగా 1952లో రెండు ఎన్నికలు జరిగాయి. సాధారణ సభకు జరిగిన ఎన్నికల్లో కేఎల్పీ పార్టీ నుంచి పోటీ చేసిన కే రామమూర్తి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పిఎల్ పాత్రుడిపై 2907 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ద్వి సభకు జరిగిన ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన కేవీ పడాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆర్ లచ్చాపాత్రుడు తన సమీప ప్రత్యర్థి నుంచి పోటీ చేసిన పి తమ్ము నాయుడుపై 6113 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్ నాయుడు ఇక్కడ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే నారాయణపై 15,966 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1967లో జరిగిన ఎన్నికల్లో టి చిట్టి నాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేసిన పి రామారావుపై 2516 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు.

1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టీ చిట్టి నాయుడు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆర్సి పడాల్ పై 2,432 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన జి అప్పలనాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టీ చిట్టి నాయుడుపై 2507 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టీ చిట్టి నాయుడు తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన ఎల్ శెట్టిపై 2568 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో కే చిట్టి నాయుడు టిడిపి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎం బాలరాజుపై 113 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎం బాలరాజు విజయం సాధించారు. టిడిపి నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి ఎమ్ వెంకటరాజు పై 14,464 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన కే చిట్టి నాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎం బాలరాజుపై 12,238 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఎం మణికుమారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బిఎస్పి నుంచి పోటీ చేసిన ఎల్ రాజారావుపై 4426 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఎల్ రాజారావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎన్ రవిశంకంపై 7,555 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పసుపులేటి బాలరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన గొడ్డేటి దేవుడుపై 587 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన గొడ్డేటి దేవుడుపై 26,141 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. టిడిపి నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న ఎలుకల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ అభ్యర్థిని మారుస్తోంది. ఇప్పటికి రెండుసార్లు ఇన్చార్జిలను మార్చిన వైసిపి.. తాజాగా మత్స్యరాస విశ్వేశ్వర రాజును నియమించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget