![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nellore News : రూ. 50 వేల కంటే ఎక్కువ జేబులో పెట్టుకుని అటెళ్తున్నారా ? అయితే ఆశలు వదులుకోవాల్సిందే
నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీల కారణంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రూ. యాభై వేల కంటే ఎక్కువుంటే తీసేసుకుంటున్నారు.
![Nellore News : రూ. 50 వేల కంటే ఎక్కువ జేబులో పెట్టుకుని అటెళ్తున్నారా ? అయితే ఆశలు వదులుకోవాల్సిందే Ordinary people are suffering due to police inspections in Nellore district. Nellore News : రూ. 50 వేల కంటే ఎక్కువ జేబులో పెట్టుకుని అటెళ్తున్నారా ? అయితే ఆశలు వదులుకోవాల్సిందే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/c29305ec497e681f93f13b0a14ea0ce5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Atmakur By Election Police Search: నెల్లూరు జిల్లా ( Nellore ) ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై రాజకీయ పార్టీల్లో పెద్దగా సందడి లేదు. అక్కడ గౌతంరెడ్డి సోదరుడే పోటీ చేస్తూండటంతో ప్రధాన పార్టీలు పోటీ చేయలేదు. బీజేపీ, ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు కానీ వారికి ఎలాంటి బలం లేదు. అక్కడ పోటీ లేదని అందరికీ క్లారిటీ ఉంది. అందుకే మెజార్టీ తెచ్చుకోవాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎడెనిమిది మంది మంత్రులు... ఓ ఇరవై , ముఫ్పై మంది ఎమ్మెల్యేలతో ప్రచారం చేస్తున్నారు. అంతే సీరియస్‌గా పోలీసులు కూడా తమ విధి నిర్వహిస్తున్నారు.
ఎన్నికల నిబంధనల కారణంగా నెల్లూరు జిల్లా మొత్తం పోలీసుల సోదాలు
ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నికల కారణంగా నెల్లూరు జిల్లా అంతా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. రూ.50వేలకు మించి నగదు జిల్లాలో ఒక చోట నుంచి మరో చోటకి తీసుకెళ్లడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే ప్రజలకు పెద్దగా అవగాహన ఉండకపోవడంతో వ్యాపార లావాదేవీలు.. ఇతర అవసరాల మేరకు సేకరించిన నగదును వెంట తీసుకెళ్లి పోతున్నారు. కానీ పోలీసులు పట్టుకుంటున్నారు.
రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తం ఉంటే స్వాధీనం
నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకట రెడ్డి పల్లి వద్ద ఆత్మకూరు ఉపఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద రూ. 7 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు అధికారులు. చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎటువంటి పత్రాలు లేకుండా కార్ లో తీసుకొని వెళ్తున రూ. 7 లక్షల నగదును చెక్ పోస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నరు. స్వాధీనం చేసుకున్న నగదును ఆత్మకూరు లోని ట్రెజరీలో జమచేశారు. అది పత్తి అమ్మగా వచ్చిన డబ్బు అని యజమానులు లబోదిబోమంటున్నారు. కానీ పోలీసులు మాత్రం తమ పని తము పూర్తి చేశారు.
నగదు ఆధారాలుంటే తీసుకెళ్లొచ్చంటున్న పోలీసులు
నగదుకి సంబంధించిన ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను సంబంధిత అధికారులకు రసీదుల రూపంలో చూపించి నగదునీ తీసుకొని వెళ్ళవచ్చు అని రోలీసులు చెుతున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా.. తనిఖీలు జరుగుతుండటంతో.. ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లేందుకు హడలిపోతున్నారు. అన్ని ఆధారాలుంటే ఇబ్బంది లేదని.. లేకపోతే రూ. యాభై వేల కంటే ఎక్కువ ఉంటే స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)