అన్వేషించండి

Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్

TelanganaNews : తెలంగాణ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మే రెండో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ఖరారు చేశారు.

Telangana Graduate MLC election :  నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్, మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.  13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.  27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనగామా నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక  అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించింది.             

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న                           

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. యూత్, గ్రాడ్యుయేట్లలో మంచి ఫాలోయింగ్ ఉన్నందున తీన్మార్మల్లన్నకు చాన్స్ వచ్చింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ .. తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా పరిశీలించారు. అసెంబ్లీ టిక్కెట్ కోసం కూడా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆయనకు పాత అవకాశమే కొత్తగా వచ్చింది. అదే ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు.

గతంలో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న 

నిజానికి ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంను కూడా దాటేసి రెండో స్థానంలో నిలిచారు. 2021లో జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత. ఆయన తన నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్‌రోల్ చేయించారు. పకడ్బందీగా పోల్ చేయించుకోగలిగారు. అయినా రెండో స్థానంలో నిలిచారు నవీన్ కుమార్. 

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మల్లన్న  

 రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష ఉన్న ఆయన తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. అంతకు ముందు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే కనీస ప్రభావం కూడా చూపించలేదు. ఇ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. రెండో స్థానంలో ఉన్నారు. ఉద్యమ నేతగా అందరి ప్రశంసలు పొందిన కోదండరాం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మల్లన్న తర్వాత స్థానంలోనే ఉండిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నందున గెలుపొందుతామన్న నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ , బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.   ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. కోడ్ కారణంగా కౌంటింగ్ వాయిదా పడింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget