TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
Telangana News: సమస్యల పరిష్కారం కాలేదని తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పోలింగ్‌ను ప్రజలు బరిష్కరించారు. తమ డిమాండ్ల తీర్చే వరకు ఓటుకు వెళ్లబోమన్నారు. అధికారులు వారితో చర్చలు జరిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఆరు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా ఓటర్లలో చైతన్యం ఏ మాత్రం తగ్గలేదు. అయితే సమస్య పేరుతో కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు.
ధాన్యం కొనలేదని
భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు తమ పంటలు పూర్తిగా పాడైపోయాయని వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతూ పోలింగ్‌ను బహిష్కరించారు. ముఖ్యంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ వరకు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న నేతలు తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
యాదాద్రి జిల్లా కనుముక్కల గ్రామంలో తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తామని నిరసన
రైతుల నిరసనతో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత pic.twitter.com/TN0223Hgep
కరెంటు లేదని
కొడంగల్‌లోని ఓ పల్లెలో మూడు రోజులుగా పవర్ లేదని ప్రజల పోలింగ్ బహిష్కరించారు. ఊరిలోని ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాలేదు. మూడు రోజులుగా కరెంటు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు గ్రామస్థులు. అధికారులు విషయాన్ని తెలుసుకొని వారితో చర్చలు జరిపారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఓట్లు వేయకుండా ధర్నా చేస్తున్న ఓటర్లు
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
మూడు రోజుల నుంచి గూడెంలో కరంట్ లేకపోవడంతో చెంచులు ఓట్లు వేయకుండా ఆందోళన చేపట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం… pic.twitter.com/MNcpmafRMd
వంతెన లేదని
ఖమ్మం జిల్లా రాయమాదారంలో ప్రజలు కూడా వంతెన కోసం పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై ఎప్పటి నుంచో వంతెన ఏర్పాటు చేయమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు సమస్య తీర్చలేదని
నిర్మల్ జిల్లా అల్లంపల్లిలో కూడా రోడ్డు సరిగా లేదని ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎప్పటి నుంచో ఉన్న రోడ్డు సమస్య తీర్చే వరకు ఓటు వేసేది లేదని భీష్కించుకొని కూర్చున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలో కూడా ప్రజలు పోలింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. స్థానికంగా జరుగుతున్న మైనింగ్‌తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. వాటిని ఆపేంత వరకు ఓటు వేయబోమన్నారు. వారికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి మృతి చెందాడు. అశ్వారావుపేటలోని నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడ పని చేస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. ఆయనకు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకపోయింది. ఆయన చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు(54) అనే ఓటర్ ఓటు వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి.
అశ్వరావుపేట పేరాయి గూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ హార్ట్ ఎటాక్ వల్ల శ్రీకృష్ణ(42) మృతి. pic.twitter.com/ibXVvxjsAM
ప్రశాంతంగా పోలింగ్: వికాస్ రాజ్
తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారులు వికాస్ రాజ్ చెప్పారు. విద్యుత్ అంతరాయం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ మొదలైందని పేర్కొన్నారు. బస్‌లు, వెహికల్స్ వెళ్లలేని ప్రాంతాలకు ఎద్దుల బండిలో ఈవీఎంలు తరలించి పోలింగ్ నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో వికాస్‌రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎస్ఆర్ నగర్లో ఓటు హక్కును వినియోగించుకున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్. pic.twitter.com/kgj0wJJd1f
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024