Andhra Pradehs News: వైసీపీలో చేరిన పోతిన మహేష్- కండువా కప్పిన జగన్
Potina Mahesh : అసెంబ్లీ టికెట్ రాలేదని అసంతృప్తితో జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు.
Jagan news: ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ ఈ ఉదయం జనసేనలో చేరారు. గుంటూరు పర్యటనలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వివిధ పార్టీల నేతలు అటు వాటు ఇటు ఇటు వారు అటు వెళ్తున్నారు. టికెట్ రాలేదని ఒకరు....ప్రాధాన్యత ఇవ్వలేదని మరికొందరు కండువాలు మార్చేస్తున్నారు. ఇన్నాళ్లు పడి కష్టానికి శ్రమ దక్కలేదని అప్పటి వరకు పని చేసినపార్టీకి శాపనార్థాలు పెట్టి మారీ వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ కోవలోని వ్యక్తి పోతిన మహేష్.
జనసేన తరఫున ఎప్పటి నుంచో పని చేస్తున్న పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ టికెట్‌ను ఆశించారు. అక్కడ టికెట్ వస్తుందని గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ టికెట్‌ను బీజేపీకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.
విజయవాడ పశ్చిమ టికెట్ తనను కాదని బీజేపీకి ఇవ్వడంపై పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. తన లాంటి బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సోమవారం జనసేనకు రాజీనామా చేశారు.