అన్వేషించండి

Jagadeesh Reddy : మోదీ, రేవంత్ కుట్రే - 16 సీట్లు గెలస్తాం - కేసీఆర్ ప్రచారం నిషేదంపై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు

Telangana News : కేసీఆర్ ప్రచారాన్ని మోదీ , రేవంత్ కుట్రతోనే ఆపించారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిషేధాలు కేసీఆర్‌ను ఆపలేవన్నారు.

Jagdish Reddy Comments :   బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటల పాటు ఈసీ బ్యాన్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మోడీ , రేవంత్ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.  మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు.  కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైందని..   ఆ యాత్రతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తోందన్నారు.  కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నమేనని విమర్శించారు. 

రెట్టింపు ప్రజా మద్దతు 

కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుందని స్పష్టం చేశారు.  వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని..  రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.  రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.  కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలు అని మండిపడ్డారు.   ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కేసీఆర్ మాటలను వక్రీకరించారని అన్నారు. 

మోడీ, రేవంత్ మాటలు ఈసీకి వినిపించవా ? 

మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా అంటూ ఫైర్ అయ్యారు.ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా  సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర కు తెర లేపారని అన్నారు.వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదనీ ప్రశ్నించారు.రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు.కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే  డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

పదహారు సీట్లు గెలుస్తున్నాం ! 

నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు అన్నారు.కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదని ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు.ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే అన్నారు. కేసీఆర్ కు మద్దతుగ నేతన్నలు కదిలివస్తున్నారని అన్నారు.కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది అన్నారు.  రేపు వివరణ  కు  రానున్న ఓటు కు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి , ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉందన్నారు. అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం అన్నారు. కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget