అన్వేషించండి

Harish Rao : ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ లీడర్‌వా ? - రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

Telangana News : చెడ్డీ గ్యాంగ్ లీడర్‌లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పై రేవంత్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao Fires On Revanth Reddy :  కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో  విమర్శిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. " కేసీఆర్ డ్రాయర్ ఊడకొడ్తా అంటుండు రేవంత్ రెడ్డి.. నువు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేదా చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా " అని ప్రశ్నించారు. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం  ఆవరణలో బీఆర్‌ఎస్‌ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.  ఎలక్షన్స్‌ ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారన్నారు. 

కాంగ్రెస్ పార్టీ వాళ్లు గారడి మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిట్ల పురాణం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది..రేవంత్ రెడ్డి తిట్ల కోసమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వార్తలు, లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను పట్టించుకోలేదని చెప్పారు. వెంకట్రామిరెడ్డి   పక్కా లోకల్.. తెల్లాపూర్‌లోనే నివాసం ఉంటారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి అధికారిగా మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. మంచి మనిషి, పరిపాలన అనుభవం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. 

దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావును చిత్తు చిత్తుగా ఓడించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. భవిషత్తు అంతా బీఅర్ఎస్ పార్టీ దేనని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేదిబీఆర్ఎస్ పార్టీయేనని, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకురాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

తుక్కుగూడ సభలో కేసీఆర్‌పై  రేవంత్ విమర్శలు 

ఇటీవల తుక్కుగూడ సభలో కేసీఆర్‌పై రేవంత్ విరుచుకుపడ్డారు.  కేసీఆర్‌ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్‌ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్‌. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్‌ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు. " అని విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget