అన్వేషించండి

Election Results 2023: డిసెంబర్ 6న ఖర్గే నివాసంలో I.N.D.I.A కూటమి కీలక భేటీ, ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్!

Election Results 2023: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డిసెంబర్ 6 న I.N.D.I.A కూటమి ఖర్గే ఇంట్లో భేటీ కానుంది.

Election Results:


డిసెంబర్ 6న సమావేశం..

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌...ఈ మూడు రాష్ట్రాల్లోనూ (Election Results 2023) బీజేపీయే లీడ్‌లో ఉంది. ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ వెనకబడిపోయింది. ఈ క్రమంలోనే I.N.D.I.A కూటమి నేతలు (I.N.D.I.A. Bloc Meet) డిసెంబర్ 6వ తేదీన సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కూటమి భవిష్యత్‌పై చర్చించనున్నారు. ఢిల్లీ వేదికగా ఈ భేటీ జరగనుంది. సెప్టెంబర్ 13న చివరిసారి ఈ కూటమి సమావేశమైంది. విపక్ష కూటమిలోని పార్టీల మధ్య ఐక్యతపై కీలకంగా చర్చించే అవకాశాలున్నాయి. అధికార బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈ భేటీలోనే నిర్ణయించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ఈ కూటమిలో 14 పార్టీల ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లోనే ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశం చాలా కీలకమైందని, అందరూ తప్పక హాజరు కావాలని ఖర్గే అందరికీ ఆహ్వానం పంపారు. కూటమి అయితే ఏర్పాటైంది కానీ...ఇప్పటి వరకూ సీట్ల షేరింగ్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సీట్ల పంపకాల్లో స్పష్టత కోసమే కూటమి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు మల్లికార్జున్ ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ కూటమి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

వ్యూహాలపై కసరత్తు..

ఇప్పటి వరకూ కాంగ్రెస్ చేతిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాలున్నాయి. ఇప్పుడవీ చేజారేలా ఉన్నాయి. I.N.D.I.A. కూటమిని లీడ్‌ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నా...ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఆ బాధ్యతలు అప్పగించేందుకు మిగతా పార్టీలు అంగీకరిస్తాయా లేదా అన్నదీ ఓ సమస్య. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కన్వీనర్‌గా ఉంటారని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి. ఇన్నాళ్లూ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఇకపై పూర్తిగా కూటమి రాజకీయాలపై దృష్టి పెట్టాలని చూస్తోంది. అందుకే అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేసుకోనుంది. ప్రచార వ్యూహాలనూ ఖరారు చేయనుంది. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget