Goa Exit Poll Live: గోవాలో మళ్లీ హంగ్- మరి కింగ్ ఎవరు? ఎగ్జిట్ పోల్ ఫలితాలివే
Goa Exit Poll: గోవా ఓటర్ నాడి పట్టుకోవడం పార్టీలకు సాధ్యపడలేదు. పోలింగ్‌కు ముందు వరకు బీజేపీ వైపు కాస్త మొగ్గిన ప్రజలు తర్వాత మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
Goa Exit Poll: గోవా రాజకీయం రంజుంగా ఉంది. తమ తీర్పును ఈవీఎంతో వేసిన ఓటర్ ఎలాంటి తీర్పు ఇచ్చాడో అన్న టెన్షన్ పార్టీలకు వదిలేశాడు. హోరాహోరీ ప్రచారంతో ప్రజల మనసులు గెలుచుకునేందుకు పార్టీలు చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిచిందన్న విషయంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అదే సస్పెషన్ష్ పెట్టాయి.
టగ్ ఆఫ్ వార్
గోవాలో ఈ సారి రాజకీయం టగ్ ఆఫ్ వార్ లా కనిపిస్తోంది. ఫిబ్రవరి-14న పోలింగ్ జరిగిన ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదని ఇప్పటికీ తెలుస్తోంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఏబీపీ- సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.
అంత ఈజీ కాదు
పోలింగ్‌కు ముందు గోవాలో ఏబీపీ- సీఓటర్ తో కలిసి ఒపినీయన్ పోల్ చేపట్టింది. అందులో గోవా ఓటర్లనాడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడ ప్రజలు అప్పటికీ ఓ పార్టీకి అధికారం కట్టబెట్టాలనే ఆలోచన లేదని అర్థమైంది.
అప్పుడు బీజేపీ వైపు
పోలింగ్‌కు ముందు ఏబీపీ- సీఓటర్ నిర్వహించిన ఒపీనీయన్ పోల్ పరిశీలిస్తే కాంగ్రెస్ 10-14 గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తేలింది. బీజేపీకి కూడా ఓటర్లు 14-18 స్థానాలు ఇస్తారని వెల్లడైంది. ఆప్‌కు నాలుగు నుంచి ఎనిమిది స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సర్వేలో చెప్పింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 3-7 సీట్లు, ఇతరులు 0-2 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఒపినీయన్ పోల్ లో తేలింది.
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ కి 3 సీట్లు, గోవా ఫార్వర్డ్ పార్టీకి 3, ఎన్సీపీకి 1, ఇండిపెండెట్లకు ఓ సీటు వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజీ ఫాలో అయిన బీజేపీ....చిన్నపార్టీలతో గోవాలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ఇప్పుడు సీఓటర్ సర్వేతో కలిసి ఏబీపీ ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. పోలింగ్‌కు ముందు ఉన్న ఒపీనియన్‌తో పోలిస్తే, పోలింగ్ రోజు ఉన్నఅభిప్రాయం మరింత టెన్షన్ పెడుతోంది. పోలింగ్‌కు ముందు రోజు వరకు ఎడ్జ్ కాస్త బీజేపీ వైపు ఉన్నట్టు కనిపించింది. కానీ పోలింగ్ రోజున సేకరించిన సమాచారం బట్టి చూస్తే ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు.
పోలింగ్‌బూత్‌ల నుంచి ఓటర్లు వస్తున్న టైంలో అడిగిన సమాచారాన్న చూస్తే కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఆప్ స్థానాలు ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆప్ ఒకటి నుంచి ఐదు స్థానాల్లో పాగా వేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని అంచనా. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయి. ఇతరలు కూడా ఒకట్రెండు స్థానాల్లో గెలవ వచ్చని సర్వే చెబుతోంది.
ఓటింగ్ షేర్
ఓటింగ్ షేర్ ప్రకారం చూస్తే... బీజేపీ 32.7 ఓట్లశాతంతో ప్రథమ స్థానంలో ఉండబోతోంది.30.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ ద్వీతీయ స్థానంలో ఉండబోతోంది. ఆప్ 14.5 శాతం ఓట్లు దక్కనున్నాయి. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 10.5 ఓట్లు వాళ్ల కంటే ఇతరులకు ఎక్కువ ఓట్లు రానున్నాయని సర్వే చెబుతోంది. అంటే ఇతరలు 12.2 ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఏబీపీ- సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.
Also Read: Uttarakhand Exit Poll Live: దేవభూమిలో ఢీ అంటే ఢీ- భాజపా, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ!
Also Read: Punjab Exit Poll Live: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆమ్ఆద్మీ షాక్- మేజిక్ ఫిగర్ సామాన్యుడిదే!