అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

YS Jagan : ఎన్డీఏ కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లే - విశాఖలో సీఎం జగన్

YSRCP : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటేయాలని సీఎం జగన్ విశాఖ ప్రజల్ని కోరారు. వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్నారు.

Andhra Politics :  విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ తమ వైఖరి స్పష్టం చేయాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు.  టీడీపీ, బీజేపీవి ఎన్నికల కోసం పొత్తులు.. రాష్ట్ర ప్రయోజనాలపై పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు.  విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కార్మిక సంఘం నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు  ఎండాడలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ సీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ సీపీ.స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున మొట్టమొదట గళమెత్తింది. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ సీపీది రాజీలేని ధోరణి అని స్పష్టం చేసారు.

ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడం వల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత కేవలం వైఎస్ఆర్ సీపీకి మాత్రమే ఉందని, ఎందుకంటే మా పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందన్నారు.  ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ రెండూ విభిన్న నిర్ణయం ప్రకటించాయని, ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలు స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని ఇంకా స్పష్టం చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై దెబ్బ కొడుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ‘కూటమిగా ఏర్పడిన   పార్టీలు స్టీల్ ప్లాంట్ విషయంలో తమ నైతికతను, విలువలు మరిచాయని విమర్శించారు.

తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలోనూ జగన్ మట్లాడారు.  సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే.. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది. విశాఖపట్నం ఏపీకి డెస్టినేషన్‌ అవుతుంది. ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ తెలిపారు. మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా. విజయానికి దగ్గరగా ఉన్నామనే.. మనపై దాడి తీవ్రతరం చేశారని ఆరోపించారు.                              

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget