NDA Convener Chandrababu : ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు - ఫోన్ చేసి మాట్లాడిన మోదీ
NDA Convener Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఎన్డీఏ కన్వీనర్‌గా ఖరారు చేసే అవకాశం ఉంది. విజయం సాధించినందుకు చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
Chandrababu is likely to be finalized as NDA convener : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కే అవకాశం లేకపోవడంతో ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టనుంది. ఈ క్రమంలో చంద్రబాబు కూటమిని సమన్వయం చేసేందుకు కన్వీనర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ..చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తారుమారు
కేంద్రంలో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారయ్యాయి. యూపీ, బీహార్, మహారాష్ట్ర , బెంగాల్ వంటి చోట్ల అనుకున్న విధంగా బీజేపీ ఫలితాలు సాధించలేకపోవడంతో వెనుకబడిపోయింది. పూర్తి మెజార్టీకి 272 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ నెంబర్ 240 దగ్గరే ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇతర ఎన్డీఏ మిత్రులు అరవై సీట్ల వరకూ సాధిస్తున్నారు. దీంతో మూడో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా అవరోధం లేదనుకోవచ్చు.
తమ బలాన్ని పెంచుకున్న I.N.D.I.A కూటమి
అయితే ఈ సారి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం తయారయింది. ఈసారి ఇండి (I.N.D.I.A) కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది. గత రెండు ఎన్నికలతో పోల్చితే తమ బలాన్ని రెండింతలు చేసుకుంది. 97 సీట్ల వరకూ సాధిస్తోంది. మిగతా పక్షాలు తృణమూల్ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేసి ఏకంగా 31 చోట్ల విజయం సాధించింది.త తమిళనాడు, కేరళల్లో బీజేపీ అనుకున్న విధంగా ముందుకు రాలేదు. కర్ణాటకలో మంచి పలితాలు సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సాధించింది. తెలంగాణలో ఎనిమిది సీట్లలో ముందంజలో ఉంది.
ఈ క్రమంలో చంద్రబాబు .. ఇతర పార్టీలను కూడా ఎన్డీఏ వైపు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. చంద్రబాబును ఎన్డీఏ కన్వీనర్ గా ఉంచేందుకు బీజేపీ పెద్దలు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి.