అన్వేషించండి

జేపీ నడ్డాకు సమాధి కడతారా? సంస్కారం నేర్పింది ఎవరు?- కేసీఆర్‌పై రెచ్చిపోయిన బండి సంజయ్

తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. కేసీఆర్... యూజ్ లెస్ ఫెలో.. ఎవరు మీకు చదువు, సంస్కారం నేర్పింది? బతికున్నవాళ్లకు సమాధి కడతారా? ‘‘అంటూ మండిపడ్డారు. 

తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు సహా ఇచ్చిన హామీలన్నీ విస్మరించిన టీఆర్‌ఎస్‌ నేతలకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అట్లా చేస్తే కేసీఆర్‌ నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? అంటూ దుయ్యబట్టారు. గొల్ల కురుమలకు గొర్రెల పైసలు రాకుండా ఫ్రీజ్ చేయాలంటూ తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు నిరూపించే దమ్ము ఉందా? అని కేసీఆర్‌ను నిలదీశారు. దమ్ముంటే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భార్యాపిల్లలతో కలిసి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 

ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని... ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపదొస్తే ఆదుకునే పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుగోడు ఎన్నికల్లో ధీటైన వ్యక్తే లేరని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. 

బతికుండగానే మన సమాధి కట్టి, ఫొటో పెడితే కుటుంబ సభ్యులు బాధపడతారా? లేదా?... మరి టీఆర్ఎస్ వాళ్లను ఏమనాలె? నిజాయితీకి నిలువుటద్దంగా మారిన జేపీ నడ్డాకు సమాధి కట్టిన టీఆర్ఎస్ నేతలను ఏం చేయాలే? కేసీఆర్ ను ఏం చేయాలే అంటూ తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్.
 
రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. ఈరోజు ఎవరైతే సమాధి పేరుతో అవహేళన చేశారో... వారి బట్టలూడదీసి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయ్ అని హెచ్చరించారు బండి సంజయ్‌ కార్యకర్తలను కంట్రోల్ చేయడం చేతగాకుంటే మూసుకుని ఉండమన్నారు. తాను ఇట్లాంటివి సహించే ప్రసక్తే లేదన్నారు. బతికున్న వ్యక్తికి సమాధి కడతారా? తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యే లేదని చెప్పిన కేసీఆర్...  మిషన్ భగీరథ నీళ్లతో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారమైందని చెప్పి.... ఫ్లోరోసిస్ సమస్య పై జేపీ నడ్డా పేరుతో సమాధి ఎట్లా కట్టినవ్ అని నిలదీశారు. 

మునుగోడు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మాట తప్పినవ్... వాళ్లంతా సమాధి కడితే ఊరుకుంటావా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వేల మంది యువత ఉద్యోగ, ఉపాధి లేక హైదరాబాద్‌లో ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా బతుకుతున్నారు. మరి ఉద్యోగాలిస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పినవ్ కదా... అందుకు సమాధి కట్టాలా? అని అడిగారు. దళిత బంధు ఇస్తానని మాట తప్పినవ్.. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కారం కాలే.... మరి వీళ్లంతా సమాధి కడితే ఎట్లా ఉంటుందో ఊహించుకో అన్నారు. ఓ నిజాయితీ పరుడు, మహానుభావుడైన జేపీ నడ్డా పేరుతో సమాధికడతావా? అని ఫైర్‌ అయ్యారు. 

గొల్ల కురుమలకు ఇచ్చిన నగదు సీజ్ చేయాలని తాను ఎన్నికల సంఘాన్ని లేఖ రాసినట్లు మళ్లీ అబద్దాలాడతారా? అని గర్జించారు. గతంలో ఇట్లనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయంపై, హుజూరాబాద్‌లో దళిత బంధుపై ఇట్లనే అబద్దాలాడితే జనం కర్రువాత పెట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. 

చలిదొన లక్ష్మీనర్సింహాస్వామి సాక్షిగా చెబుతున్నా.... నా భార్యాపిల్లలపై ఒట్టేసి చెబుతున్నా... రేపు నేను భార్యాపిల్లలతో నేనొస్తా... దమ్ముంటే కేసీఆర్ నువ్వు, నీ కుటుంబం ఇక్కడికి రా.... ప్రమాణం చేద్దాం రా.... గొల్ల కురుమలకు డబ్బులివ్వడం చేతగాక... ఆ సాకును నాపై రుద్దుతావా? అని బండి సంజయ్‌ సవాల్ చేశారు. కేసీఆర్... దమ్ముంటే టైం.. డేట్ ఫిక్స్ చేయ్...  నా సవాల్ ను స్వీకరించాలన్నారు. లేకుంటే మునుగోడు ప్రజలు తరిమితరిమి కొడతారన్నారు. కల్లాకపటం లేని గొల్లకురుమల ఉసరు ఊరికే పోదని హెచ్చరించారు. 

కేసీఆర్‌కు మునుగోడు ఎన్నికలంటేనే వణుకు పుడుతోందని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. అందుకే జ్వరం పట్టుకుందన్నారు. కొడుకేమో ట్విట్టర్లో,... బిడ్డ లిక్కర్లో... అల్లుడు దొంగ మాటల్లో....సడ్డకుడి కొడుకు కమీషన్లలో...ఇదీ కేసీఆర్ కుటుంబం తీరని తీవ్ర ఆరోపణలు చేశారు. 

సిద్దిపేటలో దుబ్బాక లచ్చమ్మ మెడలో తాళిబొట్టుకు గుంజుకుపోయిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు బండి సంజయ్. దండుపాళ్యం ముఠా లెక్క ఇయాళ మునుగోడుపై పడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బిచ్చపు బతుకు కేసీఆర్‌దన్నారు. ఫైనాన్స్ కట్టలేదని సొంత కారును, ప్రచార రథాన్ని కూడా ఫైనాన్స్ వాళ్లు, మంజీరా బ్యాంకు వాళ్లు గుంజుకుపోయిండ్రన్నారు. దీనికి గాదె ఇన్నయ్యే సాక్షి అని చెప్పారు. ఆనాడు నయాపైసా లేని కేసీఆర్... ఇయాళ 100 కోట్ల రూపాయలతో సొంత విమానం ఎట్లా కొన్నావ్? వేల కోట్ల ఆస్తులను ఇరాన్, ఇరాక్, దుబాయ్, చైనా, బంగ్లాదేశ్‌లో ఎట్లా పెట్టుబడులు పెట్టినవో ప్రజలకు సమాధానం చెప్పాలా? అని బండి సంజయ్ నిలదీశారు. 

ఉపఎన్నికలొస్తేనే సీఎం వస్తారని... రోడ్లంటారన్నారు బండి సంజయ్‌. ఎన్నికలు కాంగనే మళ్లీ పోయి ఫాంహౌజ్‌లో పడుకునే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చౌటుప్పల్ కు రోడ్డు వచ్చిందన్నారు. గట్టుప్పల్ మండలం వచ్చిందని గుర్తు చేశారు. చేనేత బంధు వచ్చిందని... పెన్షన్లు వచ్చినయ్... బస్తీ దవాఖానా రాబోతోందని తెలిపారు. ఒక్క వ్యక్తిని ఎదుర్కొవడానికి దండుపాళ్యం ముఠా పడ్డదన్నారు. గుంట నక్కలు గుంపులుగా వచ్చినయ్... రాజగోపాల్ రెడ్డి సింహం... సింగిల్ గా వచ్చారన్నారు. గతంలో హుజూరాబాద్‌లోనూ డబ్బును టీఆర్ఎస్ నేతలు ఏరులై పారించారు. అక్కడి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు... హుజూరాబాద్ తీర్పుతో ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్ ను ఇందిరాపార్క్ కు గుంజుకొచ్చినవ్... ఇప్పుడు దేశమంతా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. 

దసరా చీరల పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ నుంచి చీరలు తీసుకుని చేనేత కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు బండి సంజయ్. తెలంగాణ తల్లి రోదిస్తోంది... కేసీఆర్ కబంధ హస్తాల్లో బంధీ అయిన... బంధవిముక్తి చేయాలని మునుగోడు ప్రజలను బండి సంజయ్ వేడుకున్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి జరగాలంటే... మునుగోడులో టీఆర్ఎస్ ను తరిమితరిమికొట్టాలన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Embed widget