Assembly Elections 2023 Live Updates: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్‌ల దాడి, మధ్యప్రదేశ్‌లో ఘర్షణలు - ఉద్రిక్తతల మధ్యే పోలింగ్
MP And CG Assembly Elections 2023 Live Updates: మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు 2,533 మంది, ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 స్థానాలకు 958 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
LIVE
Background
Polling Updates In Madhya Pradesh and Chhattisgarh Assembly Elections 2023: మధ్యప్రదేశ్‌లో మొత్తం 230, ఛత్తీస్‌గఢ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ (శుక్రవారం) (నవంబర్ 17) పోలింగ్ జరుగుతోంది. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 76.47 శాతం పోలింగ్ నమోదైంది.
బుధవారం (నవంబర్ 15) సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. రెండు పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో పలు హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మధ్యప్రదేశ్‌లో 2,533 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. బాలాఘాట్, మాండ్లా, దిండోరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో 64,523 ప్రధాన పోలింగ్ కేంద్రాలు, 103 సహాయక పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 64,626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సంఖ్య 17,032 అదే సమయంలో ముంపు ప్రాంతాల సంఖ్య 1,316గా ఉంది. ఎన్నికలకు ఆటంకం కలిగించిన 4,028 మందిని గుర్తించారు. అందరిపై నిఘా పెట్టారు.
రాష్ట్రంలోని 5,160 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా పోలింగ్ సిబ్బంది ఉంటారని, ఈ పోలింగ్ కేంద్రాల్లో మహిళా అధికారులు, సిబ్బంది ఉంటారని, దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మొత్తం 183 పోలింగ్ కేంద్రాలను వికలాంగులకు కేటాయించారు. 371 యూత్ మేనేజ్డ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,536 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జబల్పూర్ జిల్లాలో 50, బాలాఘాట్‌లో 57 గ్రీన్ బూత్లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో గోండియా మహారాష్ట్రలో ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జబల్ పూర్ లో పోలింగ్ ముగిసే వరకు ఎయిర్ అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి. ఒక హెలికాప్టర్ బాలాఘాట్ లో, మరో హెలికాప్టర్ భోపాల్ లో అందుబాటులో ఉంటాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని రాజిమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత బింద్రనావగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అక్కడ మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు 827 మంది పురుషులు, 130 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ సహా మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చత్తీస్ గఢ్ లో రెండో దశ పోలింగ్‌లో 1,63,14,479 మంది ఓటర్లు ఉన్నారు.
చత్తీస్‌గఢ్ రెండోదశ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చెరో 70 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 44 మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ (జే) నుంచి 62 మంది, హమర్ రాజ్ పార్టీ నుంచి 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటితో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ వివరాలివే..
సాయంత్రం 5 గంటల నాటికి మధ్యప్రదేశ్‌లో 71.11%, ఛత్తీస్‌గఢ్‌లో 67.34% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
67.34% of voting was held in phase two of the Chhattisgarh elections, 71.11% in Madhya Pradesh till 5:00 pm pic.twitter.com/Nk6pXUDD4Z
— ANI (@ANI) November 17, 2023
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్‌ల దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియబంద్ వద్ద నక్సలైట్‌లు IED పేల్చారు. ఈ ఘటనలో ITBP పోలీస్ మృతి చెందాడు.
Chhattisgarh | One ITBP jawan was killed in an IED blast carried out by Naxalites in Gariaband
— ANI (@ANI) November 17, 2023
ఘర్షణల్లో ఒకరు మృతి
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌నగర్ నియోజకవర్గంలో రెండు గ్రూపులు తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. ఈ గొడవలో కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుడు ప్రాణాలు కోల్పోయారు.
మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ఎంతంటే..?
మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఛత్తీస్‌గఢ్‌లో 55% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 60.45% పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటు వేసిన భూపేశ్
ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్ నియోజకవర్గంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
VIDEO | Chhattisgarh CM @bhupeshbaghel casts his vote in Jheet village of Patan Assembly constituency. #ChhattisgarhElections2023 #AssemblyElectionsWithPTI pic.twitter.com/cX0vjIqPiC
— Press Trust of India (@PTI_News) November 17, 2023