(Source: ECI/ABP News/ABP Majha)
Nursing Seats: బీఎస్సీ నర్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 987 సీట్లు మిగులు
నర్సింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ సీట్లను కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని నర్సింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ సీట్లను కేటాయించింది. ఈ కౌన్సెటింగ్‌లో భాగంగా వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న 6171 మంది అభ్యర్థులకు యూనివర్సిటీ సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 31న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. అదే తేదీ నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
2023-24 విద్యా సంవత్సరానికి వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 211 నర్సింగ్ కళాశాలు ఉండగా.. వాటిలో మొత్తం 7,158 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి నిర్వహించిన మొదటి విడత వెబ్ ఆథారిత కౌన్సెలింగ్‌లో మొత్తం 6,171 మందికి సీట్ల ప్రవేశాలు కేటాయించినట్లు హెల్త్ యూనివర్శిటీ ప్రకటించింది. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత ఇంకా 987 సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి.
కళాశాలవారీగా సీట్ల కేటాయింపు వివరాలు..
ప్రిన్సిపల్స్‌కు కీలక సూచనలు..
బీఎస్సీ నర్సింగ్ మొదటి విడత సీట్ల కేటాయిపు పూర్తయిన నేపథ్యంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ, దాని పరిధిలోని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు అక్టోబరు 27న అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి అక్టోబరు 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 27న అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 31లోగా నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తుతోపాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 31 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు తెలిపింది. సంబంధిత కళాశాలలు నవంబరు 2న సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో రిపోర్ట్ చేసిన, రిపోర్ట్ చేయని విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేయాల్సిందిగా యూనివర్సిటీ ప్రిన్సిపల్స్‌ను కోరింది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ఫీజు ఎంతంటే?
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ.56,00 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ పొందాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ యూపీఐ విధానాల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాపసు ఇవ్వబడదు. విద్యార్థులు యూనివర్సిటీ ఫీజుతోపాటు స్పెషల్ ఫీజు కింద మొదటి సంవత్సరం రూ.16,000; రెండో సంవత్సరం రూ.10,000; మూడో సంవత్సరం రూ.10,000; నాలుగో సంవత్సరం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కేవలం మొదటి సంవత్సరం మాత్రమే అడ్మిషన్ ఫీజు రూ.2000, నర్సింగ్ కిట్ ఫీజు రూ.1000, హెల్త్ ఇన్స్యూరెన్స్ (హెపటైటిస్-బి) & ఎస్‌ఎన్‌ఏ ఫండ్ కింద రూ.500, డిపాజిట్ కింద రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ:
KNRUHS: బీఎస్సీ అలైడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..
తెలంగాణలోని బీఎస్సీ అలైయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేయనున్నారు. విద్యార్థులు అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..