Virchow Scholarship Program: బాలికల విద్యకు ప్రోత్సాహం - విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఈ స్కాలర్‌షిప్ కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన, ఆర్థికంగా వెనుకబడిన బాలికల చదువు కోసం విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2022 ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి లేదా ఇంటర్ లేదా ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నవారు, ప్రభుత్వ కళాశాలల్లో డిప్లొమా, డిగ్రీ చదువుతున్న బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల్లోపు ఉండాలి.
అర్హత: కేవలం బాలికలకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం లేదా డిగ్రీ/డిప్లొమా చదివి ఉండాలి. 10/12 పరీక్షల్లో 70 శాతానికి పైగా మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అకడమిక్ అవసరాలకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ఉపయోగించాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్ ప్రయోజనాలు: 10వ తరగతి పాసై ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.10,000 స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇంటర్ పాసై డిగ్రీ/డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000 స్కాలర్‌షిప్ ఇస్తారు.
అవసరమైన డాక్యుమెంట్లు..
- 10, 12వ తరగతి మార్క్‌షీట్
- ప్రభుత్వం జారీచేసిన ఐటీ ప్రూఫ్ (ఆధార్/ ఓటర్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డు)
- ప్రస్తుతం ప్రవేశానికి సంబంధించిన ప్రూఫ్ (ఫీజు రిసిప్ట్/ అడ్మిషన్ లెటర్/ విద్యాసంస్థ ఐడీకార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్)
- కుటుంబ ఆదాయ ధ్రువీకరణ కోసం శాలరీ స్లిప్/ఫామ్-16/ ఇన్‌కమ్ సర్టిఫికేట్/ ఐటీఆర్/ etc. జతచేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల ఫొటో, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరమవుతాయి.
చివరితేది: 31-08-2022
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Notification & Online Aplication
Related Articles:
PM YASASVI Scheme 2022: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్:
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
HDFC ECS Scholarships:పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ స్కాలర్‌షిప్:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందుతోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి నుండి డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లను అభ్యసించే పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
PM Scholarships: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి గాను అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా వారి ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అందిస్తారు. విద్యార్థులు చదువుతున్న కోర్సుల ఆధారంగా ఏడాదికి రూ.2500 నుంచి రూ.13,500 వరకు ఉపకారవేతనం అందిస్తారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..