News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UK Student Visa: భార‌తీయ విద్యార్థుల‌కు షాకిచ్చిన బ్రిట‌న్‌, 'స్టూడెంట్ వీసా' ఫీజు పెంపు

భారతీయ విద్యార్థులకు బ్రిట‌న్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల నుంచి వ‌సూల్ చేసే స్టడీ వీసా ఫీజును భారీగా పెంచేసింది. దాదాపు 127 పౌండ్ల వ‌ర‌కు ఫీజును పెంచారు.

FOLLOW US: 
Share:

భారతీయ విద్యార్థులకు బ్రిట‌న్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల నుంచి వ‌సూల్ చేసే స్టడీ వీసా ఫీజును భారీగా పెంచేసింది. దాదాపు 127 పౌండ్ల వ‌ర‌కు ఫీజును పెంచారు. మనదేశ కరెన్సీలో పెంచిన మొత్తం రూ.13 వేలకు సమానం. అక్టోబ‌ర్ 4 నుంచే పెంచిన ఫీజులు అమ‌ల్లోకి రానున్నాయి. దీనిపై బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇటీవ‌ల చ‌ట్టం చేశారు. 

స్టూడెంట్ వీసా ద‌ర‌ఖాస్తు ఫీజును 490 పౌండ్ల వ‌ర‌కు వ‌సూలు చేయ‌నున్నట్లు యూకే హోం ఆఫీసు వెల్లడించింది. స్టూడెంట్ వీసాతోపాటు, ప‌ర్యాట‌కుల‌కు ఇచ్చే విజిటింగ్ వీసా ఫీజును కూడా ప్రభుత్వం పెంచింది. విజిట్ వీసాపై 15 పౌండ్లు పెంచారు. దీంతో ఇప్పుడు ఆ వీసా ఖ‌రీదు 115 పౌండ్లుగా మారింది. ఇది కేవ‌లం 6 నెలల విజిట్ వీసాకు మాత్రమే. 

అక్టోబ‌ర్ నాలుగో తేదీ నుంచి కొత్త ఫీజులు అమలులోకి రానున్నట్లు యూకే ఇమ్మిగ్రేష‌న్ అధికారులు తెలిపారు. 2021-2022 సీజ‌న్‌లో భార‌త్ నుంచి సుమారు ల‌క్షా 20 వేల మంది చ‌దువు కోసం బ్రిట‌న్ వెళ్లారు. ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న విదేశీయుల్లో ఇండియ‌న్ల సంఖ్యే ఎక్కువ‌. కీల‌కమైన సేవ‌ల్ని అందించేందుకు ఉద్దేశంతో ఫీజును పెంచిన‌ట్లు ప్రభుత్వం పేర్కొంది. 

ALSO READ:

సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇలా
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్) కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తిగా మారింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య ఎల్.పాండురంగారెడ్డి శుక్రవారం (సెప్టెంబరు 15న) విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదట రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబరు 15గా నిర్ణయించగా... తాజాగా ఆ గడువును సెప్టెంబరు 22 వరకు పొడిగించారు. మహాత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. శుక్రవారం వరకు మొత్తం 30 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్ 'దూరవిద్య' డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష‌న్‌ సెప్టెంబరు 19న విడుద‌ల చేయ‌నున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎడ్‌సెట్ ప్రవేశాల‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సెప్టెంబరు 20 నుంచి 30 లోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 16 Sep 2023 01:01 PM (IST) Tags: UK government Education News in Telugu UK hikes student’s visa Fee Visit visa to the United Kingdom Student visa fee

ఇవి కూడా చూడండి

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?