UGC: యూజీసీ 'వాట్సాప్ ఛానల్' ప్రారంభం, విద్యార్థులకు మరింత చేరువగా సేవలు
విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 'యూజీసీ వాట్సాప్ ఛానెల్'ను ప్రారంభించింది.
దేశంలోని ఉన్నత విద్యాసంస్కరణల్లో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 'యూజీసీ వాట్సాప్ ఛానెల్'ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ ఇండియా వాట్సాప్ ఛానెల్‌ని ప్రారంభించడం అనేది మరింత సమగ్రమైన మరియు సమాచారంతో కూడిన ఉన్నత విద్యా రంగాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు.
సాంకేతికతను స్వీకరించడం, విస్తృతంగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ద్వారా, యూజీసీ దాని కమ్యూనికేషన్ వ్యూహాన్ని ఆధునీకరిస్తోందని, దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు విద్యాసంస్థలకు రియల్‌టైమ్‌లో సమాచారం అందుతుందని పేర్కొన్నారు. విద్యా పరిపాలనలో పారదర్శకత, సమర్థతను మెరుగుపరుస్తోందని ఆయన అన్నారు. విద్యా పరిపాలనలో యాక్సెసిబిలిటీ, పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క ముఖ్య ప్రయోజనాల్లో అందరిని ఏకతాటిపైకి తేవడమే అని యూజీసీ తెలిపింది. ప్రతి ఒక్కరూ యూజీసీ వెబ్‌సైట్‌లు లేదా ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు అవాంతరాలు లేని యాక్సెస్‌ను కలిగి ఉండరని గుర్తించి, విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి వాట్సాప్ ఛానెల్ శక్తివంతమైన సాధనంగా మారుతుందని యూజీసీ తెలిపింది.
"భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో, కనెక్టివిటీ మారుతూ ఉంటుంది, ఈ చొరవ డిజిటల్ విభజనను తగ్గిస్తుంది మరియు ఉన్నత విద్యపై పాలసీ అప్‌డేట్‌లు అందరికీ తక్షణమే అందుబాటులో ఉండేలా చూస్తుంది" అని UGC తెలిపింది.
ALSO READ:
యువత కోసం ‘మై భారత్’ పథకం, కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలోని 40 కోట్ల యువతకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా 'మేరా యువ భారత్(మై భారత్)' పేరిట ఒక స్వయంప్రతిపత్తి కలిగిన వేదిక ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో పంచుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..