TS Inter Supply Results: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
➥ ఫస్టియర్‌లో జనరల్ 63 శాతం, ఒకేషనల్ 55 శాతం ఉత్తీర్ణత
➥ సెకండియర్‌లో జనరల్ 46 శాతం, వొకేషనల్ 60 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, బ్రిడ్జ్ కోర్సు, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు అన్ని కోర్సుల ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఉత్తీర్ణత వివరాలు ఇలా..
➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, వొకేషనల్ విద్యార్థులు 55 శాతం ఉత్తీర్ణత సాధించారు.
➥ ఇంటర్ ఫస్టియర్‌లో 2,52,055 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. 1,57,741 మంది ఉత్తీర్ణత సాధించారు.
➥ ఫస్టియర్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 18,697 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 10,319 మంది ఉత్తీర్ణులయ్యారు.
➥ ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో జనరల్ విద్యార్థులు 46 శాతం, వొకేషనల్ విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు.
➥ ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 1,29,494 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. 59,669 మంది ఉత్తీర్ణత సాధించారు.
➥ సెకండియర్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 11,013 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 6,579 మంది ఉత్తీర్ణులయ్యారు.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ వారికి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కి కలిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ALSO READ:
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని, ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!
ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్‌కు సంబంధించిన తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial