ఇంటర్ మెమోలు వచ్చేశాయ్! ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి!
తెలంగాణలో ఎంసెట్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కుల మెమోలను తెలంగాణ ఇంటర్ బోర్డు అందుబాటులో ఉంచింది.
తెలంగాణలో ఎంసెట్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కుల మెమోలను తెలంగాణ ఇంటర్ బోర్డు అందుబాటులో ఉంచింది. ఇంటర్ ఫలితాల్లో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 62.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఫస్టియర్‌లో 61.68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 63.49 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,82,675 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,97,741 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో జనరల్ విద్యార్థులు 2,72,208 కాగా, ఒకేషనల్ విద్యార్థులు 25,533 మంది ఉన్నారు. ఇక గ్రూపులవారీగా చూస్తే.. ఎంపీసీలో 72.73 శాతం, బైపీసీలో 67.44 శాతం, సీఈసీలో 47.25 శాతం, హెచ్‌ఈసీలో 46.69 శాతం, ఎంఈసీలో 59.97 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాల్లో బాలికలదే పైచేయి...
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 68.68 శాతంగా నమోదుకాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 54.66 శాతంగా నమోదైంది. ఇక సెకండియర్‌లోనూ బాలికల హవానే కొనసాగింది. ఫలితాల్లో బాలికలు 71.57 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 55.60 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దు: సబితా
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫలితాలను విడుదల చేశాం. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించాం. విద్యార్థి దశలో ఇంటర్ అనేది కీలకమైంది. జీవితానికి టర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫస్టియర్, సెకండియర్ 9,45,153 మంది హాజరయ్యారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాం. 26 వేల మంది సేవలందించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీని తీసేస్తున్నామని ప్రకటించారు. పిల్లలు ఎవరూ కూడా ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఎంసెట్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏ జిల్లా టాప్- ఏ జిల్లా ఉత్తీర్ణత పడిపోయింది?
తెలంగాణలో ఎంసెట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఇవాళ (మే 9న) విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
జిల్లాలవారీగా ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..