TS Inter Board: ఈ ఏడాది నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, 'సీఈఏ' గ్రూప్ ఈసారికి లేనట్లే!
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు.
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్ రాతపరీక్షకు 80 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు.
కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలుచేయాలని గత నవంబరులో జరిగిన ఇంటర్ బోర్డు పాలకమండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ఇంగ్లిషులో ప్రాక్టికల్స్ అమలు ఒకటి. విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని, దానివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్‌కు సిలబస్ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారులు చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడిస్తారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు చెప్పి.. ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడతారో పరీక్షిస్తారు. ఇందుకు సంబంధించిన నిపుణులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు వైవా తరహాలోనే ఈ పరీక్ష ఉంటుందని ఒకరు వ్యాఖ్యానించారు. జూనియర్ కళాశాలల తరగతులు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వనుంది.
'
పాత సిలబస్‌తోనే సెకండ్ లాంగ్వేజ్ పుస్తకాలు..
ఇంటర్‌లో సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ తదితరాల సిలబస్ మార్చాల్చి ఉంది. అయితే ఈ విద్యాసంవత్సరంలో ఫస్టియర్, వచే ఏడాది(2024-25)లో సెకండియర్ పాఠ్యపుస్తకాలు మార్చాలని బోర్డు నిర్ణయించింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా భాషా విధానం మారింది. దానిపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం లాంగ్వేజ్ సబ్జెక్టులకు కొత్త సిలబస్ రావొచ్చని అంచనాకు వచ్చిన అధికారులు ఈ ఏడాది ఇక్కడ మార్పు చేస్తే ఇబ్బంది అవుతుందని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్‌కు సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి సెకండ్ లాంగ్వేజ్‌ను పాత సిలబస్ ప్రకారమే బోధించనున్నారు.
''సీఈఏ" గ్రూప్ ఈసారికి లేనట్లే!
ఇంటర్ బోర్డు ఇప్పటివరకూ ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు ఒకే స్థాయి గణితాన్ని అమలుచేస్తూ వస్తోంది. మరీ ఎక్కువ స్థాయి గణితం సీఈసీ విద్యార్థులకు అవసరం లేదని భావించిన బోర్డు.. కొత్త విద్యాసంవత్సరం నుంచి మార్చాలని గతంలో నిర్ణయించింది. కామర్స్ విద్యార్థులకు అవసరమైన మేరకు సిలబస్ ఉంచి.. కొన్ని మార్పులతో ప్రత్యేకంగా గణితం సబ్జెక్టు తీసుకురావాలని నిర్ణయించారు. అది కూడా ఈసారి అమల్లోకి రావడం లేదు. ప్రత్యేకంగా సీఈఏ (కామర్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్) గ్రూపును తీసుకురావాలని నిర్ణయించినా.. అది కూడా ఈ విద్యాసంవత్సరం అమలుకావడం లేదు.
Also Read:
గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్!
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..