అన్వేషించండి

TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా

Telangana Inter Results 2026 Link | తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు https://tgbie.in/result.html లో విడుదల చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12 (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ కార్యదర్శి, టీజీబీఐఈ వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా పాల్గొని ఫలితాలను విడుదల చేయనున్నారు. https://tgbie.in/result.html 

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4.41 లక్షలు కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.07 లక్షల మంది ఉన్నారు.  ఇంటర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఫలితాలను ఎలా చూసుకోవాలి? విద్యార్థులు తమ ఫలితాలను, మార్కుల మెమోను అధికారిక వెబ్‌సైట్లు  https://tgbie.cgg.gov.in , http://results.cgg.gov.in లో సులభంగా పొందవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వెంటనే ఫలితాలను పొందవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోవాలని సూచించారు.


TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు

వెబ్‌సైట్లతో పాటు ఈసారి వాట్సాప్ ద్వారా  కూడా ఫలితాలు పొందే వెసులుబాటు కల్పించారు. దీనికోసం 8096958096 నెంబర్‌కు వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపి, అక్కడ అడిగిన వివరాలు, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా సులభంగా మార్కుల మెమోను పొందవచ్చు. ఫలితాల అనంతరం మార్కులతో అసంతృప్తిగా ఉన్న వారికి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా బోర్డు కల్పించనుంది. https://tgbie.in/result.html  

ఉత్తీర్ణత, గ్రేడింగ్

ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే A గ్రేడ్, 60 నుంచి 74 శాతం మధ్య మార్కులు వస్తే B గ్రేడ్ కేటాయిస్తారు. ఒకవేళ ఫలితాలతో అసంతృప్తిగా ఉంటే, రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని బోర్డు కల్పించనుంది. అతి తక్కువ సమయంలోనే మూల్యాంకనం పూర్తి చేసి బోర్డు ఈ ఫలితాలను సిద్ధం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget