TS EdCET Counselling: ఎడ్‌సెట్ 'ఫేజ్-2; కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ ప్రవేశాల కమిటీ విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 16 నుంచి 20 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ 2022 రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ నవంబరు 15న విడుదలైంది. తెలంగాణ ప్రవేశాల కమిటీ విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 16 నుంచి 20 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. నవంబరు 22న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 23, 24 తేదీల్లో ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. నవంబరు 25న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం కల్పించనున్నారు. నవంబర్ 28న ఎంపికైన అభ్యర్థుల జాబితాను కాలేజీల వారిగా ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 29 నుంచి డిసెంబరు 3 మధ్య సంబంధిత కళాశాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీలో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
షెడ్యూల్ ఇదే...
✈ నవంబరు 16 నుంచి 20 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
✈ నవంబరు 22న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటన.
✈ నవంబరు 23, 24 తేదీల్లో ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం.
✈ నవంబరు 25న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం
✈ నవంబర్ 28న కాలేజీలవారీగా అభ్యర్థుల జాబితా ప్రకటన
✈ నవంబరు 29 నుంచి డిసెంబరు 3 మధ్య సంబంధిత కళాశాల్లో రిపోర్టింగ్.
Phase -II Conselling Notification
ఈ ఏడాది ఈ ఏడాది టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న టీఎస్‌ఎడ్‌సెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,578 మంది హాజరుకాగా.. 30,580 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎడ్‌సెట్ ర్యాంక్ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ నిర్వహించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్-2022(ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) తొలివిడత సీట్లను నవంబర్ 5న కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా 10,053 మందికి సీట్లు దక్కాయని ఎడ్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్ బాబు తెలిపారు. సీట్లు పొందినవారు నవంబర్ 11 లోపు కళాశాలల్లో చేరాలని, నవంబరు 14 నుంచి తరగతులు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ 2022-23 కౌన్సెలింగ్ అక్టోబరు 18న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అక్టోబరు 28 నుంచి 30 వరకు ఫేజ్-1 వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 31న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. నవంబర్ 5న సీట్లను కేటాయించారు.ఈ ఏడాది ఈ ఏడాది టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న టీఎస్‌ఎడ్‌సెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,578 మంది హాజరుకాగా.. 30,580 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
::Also Read::
విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ప్రాంగణ నియామకాల్లో ప్రాధాన్యంతోపాటు అదనపు క్రెడిట్లు దక్కుతాయని రిజిస్ట్రార్ మంజూర్‌హుస్సేన్ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..