News
News
X

విద్యార్థులకు జేఎన్​టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!

ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుంది. జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు చేయొచ్చు..

FOLLOW US: 

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్‌ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ప్రాంగణ నియామకాల్లో ప్రాధాన్యంతోపాటు అదనపు క్రెడిట్లు దక్కుతాయని రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్‌ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.

ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసిన సామర్థ్యంతో కొలువుతోపాటు ప్యాకేజీ ఎక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో డ్యూయల్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విధి విధానాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో యూజీసీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఆలోచనల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే వర్సిటీలో కోర్సును ప్రవేశపెట్టారు.

బీబీఏ-డేటా అనలిటిక్స్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. దీనికి సంబంధించి సిలబస్‌ సిద్ధమైంది. కోర్సు బోధన వారానికి ఐదు రోజులు ఆన్‌లైన్‌, ఒకరోజు ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు చేయొచ్చు. బీబీఏ-డేటా అనలిటిక్స్ కోర్సు వ్యవధి మూడేళ్లు. దీనికి సంబంధించి సిలబస్ సిద్ధమైంది. కోర్సు బోధన వారానికి ఐదు రోజులు ఆన్‌లైన్ ఒకరోజు ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు కూడా చదవొచ్చు.

News Reels

కోర్సులో చేరేందుకు బీటెక్‌ మొదటి, రెండు, మూడో ఏడాది విద్యార్థులు అర్హులు. మొదటి, రెండో ఏడాదిలో చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ పూర్తయ్యేలోపే బీబీఏ డిగ్రీ పట్టా అందుకునే వీలుంటుంది. మూడో సంవత్సరంలో చేరిన విద్యార్థులు అదనంగా మరో ఏడాది చదవాలి. ఈ విధానంలో క్రెడిట్ల బదలాయింపునకు వీలుంటుంది. ఒక కోర్సులో చదివిన సబ్జెక్టులకు సంబంధించిన క్రెడిట్లను మరో కోర్సుకు బదలాయించుకోవచ్చు. ఉదాహరణకు ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో చదివిన సబ్జెక్టు బీబీఏ రెండో ఏడాదిలో మళ్లీ ఉందనుకోండి.. అప్పటికే ఇంజినీరింగ్‌లో చదివినందున.. బీబీఏలో చదవనక్కర్లేదు. ఇంజినీరింగ్‌లో వచ్చిన క్రెడిట్లు బీబీఏకు బదిలీ అవుతాయి.


KNRUHS: యూజీ ఆయూష్‌ కోర్సుల్లో ప్రవేశాలు, నేటి నుంచి దరఖాస్తులు
యూజీ ఆయూష్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయూష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్‌ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 13 Nov 2022 08:07 PM (IST) Tags: Education News B.tech JNTU Dual Degrees BBA B.Tech with BBA JNTU News

సంబంధిత కథనాలు

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

KNRUHS BDS Counselling: ఎంబీబీఎస్, బీడీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, ఆప్షన్లు ఇచ్చుకోండి!

KNRUHS BDS Counselling: ఎంబీబీఎస్,  బీడీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌,  ఆప్షన్లు ఇచ్చుకోండి!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్