అన్వేషించండి

ECET: ఈసెట్ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు పూర్తి, 9754 విద్యార్థులకు ప్రవేశాలు

తెలంగాణలో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఆగస్టు 8న సీట్లను కేటాయించారు.

తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఆగస్టు 8న సీట్లు కేటాయించారు. మొత్తం 9754 సీట్లు కేటాయించగా.. ఇందులో ఇంజినీరింగ్‌-9680, ఫార్మసీ-74 సీట్లు ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 12 వరకు సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.  మొదటివిడత కౌన్సెలింగ్ తర్వాత ఇంజినీరింగ్‌లో 2,092 సీట్లు, ఫార్మసీలో 1129  సీట్లు మిగిలాయి. ఆగస్టు 20 నుంచి తుది విడత ఈసెట్ కౌన్సెలింగ్ ఉంటుందని కన్వీనర్‌ వివరించారు.

'టీఎస్ ఈసెట్‌-2023' మొదటివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 29 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకున్నారు. వీరికి ఆగస్టు 8న తొలి విడత సీట్లను కేటాయించారు. తదనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 20 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆగస్టు 26న తుది విడత సీట్లను కేటాయిస్తారు. ఇక చివరగా.. ఆగస్టు 28న అభ్యర్థులకు స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌: 20.08.2023 - 21.08.2023 వరకు

➥ ధ్రువపత్రాల పరిశీలన: 22.08.2023  

➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 20.08.2023 - 23.08.2023 వరకు

➥ ఆప్షన్ల ఫ్రీజింగ్: 23.08.2023.

➥ తుది విడత సీట్ల కేటాయింపు: 26.08.2023. 

➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 26.08.2023 - 29.08.2023 వరకు

➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 26.08.2023 - 30.08.2023 వరకు

➥ స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల: 28.08.2023.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్

కౌన్సెలింగ్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ప్రకటన విడుదల - దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య కేంద్రం (ఓయూసీడీఈ) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించి జులై 28 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సు్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget