అన్వేషించండి

ICET: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌.

➥ ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన.

➥ ఆగస్టు 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.

➥ ఆగస్టు 25న తొలి విడత సీట్ల కేటాయిపు. 

➥ సెప్టెంబరు 1 నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. 

➥ సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు.

➥ సెప్టెంబరు 7న తుది విడత సీట్ల కేటాయింపు 

➥ సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు.

Counselling Website

ALSO READ:

ముగిసిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల గడువు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి చేపట్టిన ఎంసెట్-2023 వెబ్ ఆప్షన్ల గడువు జులై 12తో ముగిసింది. మొత్తం 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరి నుంచి మొత్తం 49,42,005 ఆప్షన్లు నమోదయ్యాయి. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 1,109 ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. అభ్యర్థులకు జులై 16లోపు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. జులై 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. జులై 9న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు జులై 12తో ముగిసింది.  
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జోసా కౌన్సెలింగ్-2023 మూడో రౌండ్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ 2023 మూడో రౌండ్ ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు ఫలితాలను అందుబాటులో ఉంచారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో జేఈఈ ర్యాంకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సీటు కేటాయింపు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఇతర విద్యా సంస్థల్లో బీటెక్‌ సీట్లు జోసా కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు సీట్ ప్రాసెసింగ్ ఫీజును జమ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
iPhone 17 Slim: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SIT Investigates Pulivarti Nani Incident | Tirupati | పులివర్తి నానిని విచారించిన సి‌ట్ అధికారులుAbhishek Sharma Batting In IPL 2024 | దూకే ధైర్యమా జాగ్రత్త... అభిషేక్ శర్మ ముంగిట నువ్వెంతSRH vs RCB Final | 2016 IPL Final Repeat |SRHకు పాత బాకీలు తీరుస్తామంటున్న RCB| ABP DesamKKR vs SRH Qualifier IPL 2024 | RRకు దెబ్బెసిన అదే వర్షం..SRH ను కాపాడింది| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
iPhone 17 Slim: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
Lok Sabha Elections 2024: ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
Top 5 Hatchback Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
Jr NTR Birthday Special: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
Weather Latest Update: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్! వాటి ప్రస్తుత గమనం ఇదే
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్! వాటి ప్రస్తుత గమనం ఇదే
Embed widget